బిజినెస్‌లోకి మెగాస్టార్‌ కూతురు.. రకుల్‌ దారిలోనే శ్రీజ కొత్త వ్యాపారం.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్..

Published : Apr 25, 2024, 05:22 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల వైవాహిక జీవితంలో విఫలమైంది. దీంతో ఇప్పుడు బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. ఇటీవలే కొత్త  వ్యాపారం స్టార్ట్ చేసింది. 

PREV
17
బిజినెస్‌లోకి మెగాస్టార్‌ కూతురు.. రకుల్‌ దారిలోనే శ్రీజ కొత్త వ్యాపారం.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్..

మెగాస్టార్‌ చిన్న కూతురు శ్రీజ ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకుని, డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. తమ పిల్లల బాగోగులు చూసుకుంటూ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది. వైవాహికంగా ఒంటరైనా, తమ పిల్లలతో ఉంటూ ఆ చేదు జ్ఞాపకాలకు దూరంగా ఉంటుంది. 
 

27

అయితే ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది. తాను ఇండిపెండెంట్‌ ఉమెన్‌గా నిలబడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో శ్రీజ ఇప్పుడు కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆమె వ్యాపారంలో రాణించాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఫిట్‌ నెస్‌ సెంటర్‌ని ఏర్పాటు చేయడం విశేషం. 

37

హైదరాబాద్‌లో స్టూడియో అనంత పేరుతో ఫిట్‌ నెస్‌ సెంటర్‌ని ఏర్పాటు చేసింది. ఇటీవలే దీన్ని ప్రారంభించింది. ఈ సెంటర్‌ ఓపెనింగ్‌లో సందీప్‌ కిషన్‌, రెజినా, బాలీవుడ్‌ బ్యూటీ శెట్టి శెట్టి పాల్గొనడం విశేషం. ఈ విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో వెల్లడించింది. `కొత్త ప్రమాణం ప్రారంభమైంది, ఈ జర్నీలో తాను భాగం కావడం ఆనందంగా ఉంది` అని వెల్లడించింది. మరొకరితో కలిసి శ్రీజ దీన్ని స్టార్ట్ చేయడం విశేషం. 
 

47

ఇందులో జిమ్‌, యోగా, ఇతర వర్కౌట్‌ సదుపాయాలు ఉన్నాయట. ఏరోబిక్స్ లాంటివి కూడా ఇందులో పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మానసిక ప్రశాంతతకు అడ్డాగా దీన్ని ఉంచబోతున్నారట శ్రీజ. ఆత్మవిశ్వాసం పెంచే యాక్టివిటీస్‌ చేయబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

57

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇలానే జిమ్‌, వర్కౌట్‌ సెంటర్లని ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఈసెంటర్లని నిర్మిస్తుంది. ఇటీవల ఫుడ్‌ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. యోగా సెంటర్లని నిర్వహిస్తూ బిజీగా ఉంది రకుల్. 
 

67

ఇదిలా ఉంటే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తుంది. చిరంజీవికి సంబంధించిన అన్నిస్టయిలీష్‌ ఆమెనే చూసుకుంటుంది. మరోవైపు ఆమె నిర్మాతగానూ అడుగు పెట్టబోతుంది. ఆ మధ్య చిరంజీవి సినిమాని నిర్మించేందుకు రెడీ అయ్యింది. కానీ ఇది ఆగిపోయింది. ఇక రామ్‌ చరణ్‌ హీరోగా రాణిస్తున్నారు. 
 

77

దీంతో ఇప్పుడు చిన్న కూతురు శ్రీజ సైతం స్వతహాగా తన కాళ్ల మీద నిలబడాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా ముందుకు సాగుతుందని తెలుస్తుంది. శ్రీజ మొదట.. ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శిరీష్‌ భరద్వాజ్‌ని ఆమె పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత కళ్యాణ్‌ దేవ్‌ని మ్యారేజ్‌ చేసుకుంది. కానీ ఈ ఇద్దరు కూడా విడిపోయారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories