Glowing Skin : నలుగురిలో అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ చిట్కాలు మీ కోసమే..

First Published Jan 17, 2022, 3:49 PM IST

Glowing Skin : చలికాలం అందంగా కనిపించడమంటే మాటలు కావు. ఎందుకంటే ఈ కాలంలో చల్లగాలులు, పొడి వాతావరణం మూలంగా స్కిన్ పొడిగా, పేలవంగా తయారవుతుంది. ఈ కాలంలో అందరిలో అందంగా మెరిసిపోవాలంటే మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. 

Glowing Skin : చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చాలామంది చర్మం పొడిబారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో ఒక వైపు గజగజవణికించే చలి, మరోవైపు చల్లటి గాలులు.. వీటి వల్లే చర్మం కళ తప్పుతుంది. ముఖ్యంగా వీటివల్ల చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం, పేలవంగా మారుతుంది. అందుకే ఈ Winter లో చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందులో మీరు మార్కెట్లో దొరికే Cosmetics ను ఉపయోగించినప్పటికీ మీ చర్మం మామూలుగా అవడం కొన్ని సమయాల్లో అసాధ్యం. అందులో ఆరోగ్యమైన చర్మం కోసం, పోషకాలున్న ఆహారం ఎంతో అవసరం. కాబట్టి ఈ వింటర్ లో ఏ ఆహారాన్ని తీసుకుంటే మీ చర్మం సురక్షితంగా ఉంటుందో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

ఆకుకూరలు: ఆకుకూరలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ముఖం సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో పాలకూర చర్మ సంరక్షణకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. అలాగే విటమిన్ ఏ,సి, ఇ, కె, ఖనిజాలు వంటివి పుష్కలంగా లభించే బచ్చలి కూర కూడా చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకు కూరలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడంతో పాటుగా ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. బచ్చలికూరను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా నీళ్లను కలిపి ఫేస్ ప్యాక్ లా ముఖం పై అప్లై చేసుకోవచ్చు. ఆ ప్యాక్ ను 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువచ్చటి నీళ్లతో నీట్ కడగాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఫ్రెష్ గా కనిపించడంతో పాటుగా తళతళ మెరిసిపోతుంది. UV కిరణాల నుంచి కూడా చర్మాన్ని రక్షించడంలో బచ్చలి కూర దివ్య ఔషదంగా ఉపయోగపడుతుంది.

క్యారెట్: పొడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ క్యారెట్ లో ఎ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ  సంరక్షణలు ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఈ క్యారెట్ ను ఫేస్ ప్యాక్ లా చేసి వాడితే ముఖం మరింత తాజాగా అందంగా మారిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేసుకోవాలంటే.. కొన్ని క్యారెట్ల ను తీసుకుని వాటిని నీళ్లలో ఉడికించాలి. అవి చల్లారిన తర్వాత పేస్ట్ లా చేయ్యాలి. దానిని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత నీళ్లతో కడగాలి. 
 

టొమాటో: చర్మాన్ని నిగనిగ మెరిపించడంలో టొమాటో బాగా ఉపయోగపడుతుంది. ఈ టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల చర్మం అందంగా మారిపోతుంది. కాబట్టి టొమాటోను గుజ్జుగా చేసి లేదా టొమాటో రసాన్ని ముఖంపై రాయడం వల్ల ముఖంపై పేరుకు పోయిన జిడ్డు వదిలేలా చేయడంలో సహాయపడుతుంది. చర్మం జిడ్డుగా ఉండేవాళ్లకు టొమాటో బాగా ఉపయోగపడుతుంది.

పాలకూర.. పాలకూర చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కూరను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో లాభాలున్నాయి. చర్మ సంరక్షణకే కాదు జుట్టు పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు కూరలో విటమిన్ ఎ, ఇ, సి, ఫోలిక్ యాసిడ్, జింక్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కేశాల నిగారింపునకు బాగా ఉపయోగపడతాయి. అలాగే చర్మ సౌందర్యానికి కూడా సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి.. స్కిన్ తలతల మెరిసిపోయేలా చేస్తుంది. 
 

click me!