దిండు లేకుండా నిద్రపోతే ఏమౌతుంది?

First Published Apr 30, 2024, 1:46 PM IST

మనలో చాలా మందికి దిండు పక్కాగా వాడే అలవాటు ఉంటుంది. దిండు లేకుండా నిద్రపోవడం కష్టమే. కానీ దిండుతో నిద్రపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. నిజం తెలిస్తే మీరు దిండు అసలే ఉపయోగించరు. 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో  ప్రతిరాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఈ నిద్రలేమి, బద్ధకంతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మరింత పెరిగి మీకు ముప్పుగా మారే అవకాశం ఉంది.
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన జీవితాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఎంతో సహాయపడతాయి. అందులో ఒకటి రాత్రిపూట దిండు లేకుండా నిద్రపోవడం.
అవును దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒకవేళ మీకు దిండు లేకుండా నిద్రపట్టకపోతే మీ దిండు చాలా సన్నగా ఉండేట్టటు చూసుకోండి. ఇది మీకు మంచి మేలు చేస్తుంది. 
 

నిజానికి దిండుతో నిద్రపోయే వారికి కొన్ని రకాల చర్మ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొటిమలు ఒకటి. ఎందుకంటే దిండుపై పడుకున్నప్పుడు మీ ముఖం దిండుకు అతుక్కుపోతుంది. దీనివల్ల దిండుకున్న బ్యాక్టీరియా, ధూళి మీ ముఖానికి అంటుకుంటాయి. దీనివల్ల ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. అంతేకాదు ముఖంపై మడుతలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ ముఖం అందంగా, యవ్వనంగా ఉండాలంటే మాత్రం దిండు లేకుండానే పడుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
చెబుతున్నారు.
 

దిండు లేకుండా పడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు మరింత ప్రశాంతంగా పడుకుంటారని, మీ నిద్ర నాణ్యత పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. 

మీకు దిండుపై పడుకునే అలవాటు ఉన్నట్టైతే పొడవైన దిండుకు బదులుగా చాలా చిన్న దిండును ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎత్తైన దిండును ఉపయోగించడం వల్ల మెడ, వెన్నెముకలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. 

Sleeping

దిండు లేకుండా పడుకున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. దిండుపై తల ఉంటే మీ వెన్నెముక ప్రభావితం అవుతుంది. మీకు వెన్నెముక సమస్య ఉంటే దిండును ఉపయోగించడం మానుకోండి. 

click me!