మహానందిలో ఉన్న అద్భుతాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

First Published Nov 7, 2021, 3:51 PM IST

మహానంది (Mahanandi) ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు మహానంది మండలంలో ఉంది. ఇది నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న లింగం కిందనుంచి భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా మనం మహానంది విశిష్టతను తెలుసుకుందాం.  
 

ఇక్కడి నల్లమల అడవుల్లో కొలువైవున్న  శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. పుట్టలో కొలువై ఉన్న స్వామివారికి ఆవు పాలు (Cow milk) ఇస్తుండగా కోపగించిన యజమాని(Owner) ఆవును కొట్టడంతో  పుట్టలో ఉన్న స్వామిని ఆవు తొక్కుతుంది. దాంతో స్వామి వారి శివలింగం పైన ఆవు పాదముద్ర ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగము ఎత్తుగా కాకుండా కొంచెము తప్పటగ వుంటుంది. లింగము కింద నుండి నీరు ఊరుతూ.. ఆ నీరు పుష్కరిణిలోకి చేరుతుంది.
 

అందులోకి వచ్చిన నీరు గోపురం (Dome) ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా (Pure) ఉంటాయి. శివలింగం నుండి సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన ఔషధాలు ఉన్న నీరు ప్రవహిస్తూ ఉంటాయి. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలో మలినాల్లేకుండా తేటగా ఉంటాయి ఇక్కడి నీరు.
 

మనం నీటిలోకి సూది (Needle) వేసిన స్పష్టంగా కనపడే అంత స్వచ్ఛంగా నీరు (Pure water) ఉంటాయి. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలోని అన్ని బావుల లోనూ ఇలాంటి స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు భావిస్తారు. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందుతుంది. ఇక్కడ కోదండ రామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.
 

ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర పుష్కరుణులు ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్దనంది దాని ఎదుట ఉన్న చక్కటి పుష్కరిణి ఈ రెండింటినీ కలిపి ఈ క్షేత్రానికి మహానంది తీర్ధము (Maha nandi thirthamu)అనే పేరు వచ్చింది. మహానందికి 18 కిలోమీటర్ల దూరంలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. ఈ తొమ్మిది నంది ఆలయాలను కలిపి నవ నందులని అంటారు. కార్తీకమాసంలో (Karthika masam) సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవ నందులను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మనకు పుణ్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెబుతారు.
 

సూర్యోదయం (Sunrise) నుండి సూర్యాస్తమయం (Sunset) లోపు ఈ నవనందులు దర్శిస్తే సకల దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటాం. మనం కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వసిస్తారు. 14వ శతాబ్దం నంద మహారాజు కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు తెలియజేస్తున్నాయి.

click me!