మీరు కిడ్నీ పేషెంట్లా? అయితే వీటిని తప్పకుండా తినాల్సిందే..!

First Published Jan 3, 2023, 4:01 PM IST

మన మూత్రపిండాలు చేసే పని అంతా ఇంతా కాదు. ఇవి మన రక్తాన్ని శుభ్రపరుస్తాయి. శరీరంలో వ్యార్థాలను, అదనపు నీటిని బయటకు పంపుతాయి. అందుకే కిడ్నీలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 
 

kidney disease

మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాల్లో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మన మొత్తం బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను,  అదనపు ద్రవాన్ని బయటకు పంపుతాయి. అంతేకాదు ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మీకు తెలుసా..  మన మూత్రపిండాలు శరీరం  పిహెచ్, పొటాషియం స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే ఎముకలు బలంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి. కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి విటమిన్ డి క్రియాశీలతను నియంత్రిస్తాయి కూడా.

కాగా ఈ రోజుల్లో చాలా మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. మూత్రపిండాల వ్యాధి వల్ల మూత్రపిండాలు మునపటిలా సక్రమంగా పనిచేయవు. దీనివల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అలాగే శరీరంలో ట్యాక్సిన్స్ ఎక్కువ అవుతాయి. వీటివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఏదేమైనా మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు మాత్రం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ జనాభాలో ఈ మూత్రపిండాల వ్యాధి 10% మందిని ప్రభావితం చేస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కిడ్నీ పేషెంట్లుకు ఆహారం చాలా ముఖ్యమైనది. కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కిడ్నీ రాళ్ల నొప్పి, లక్షణాలను తగ్గించడానికి లేదా నివారించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 
 

రెడ్ బెల్ పెప్పర్

రెడ్ బెల్ పెప్పర్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది. కానీ వీటి రుచి మాత్రం బాగుంటుంది. ఈ కూరగాయలు మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ అలాగే విటమిన్ బి 6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి.  ఇవన్నీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి, వీటి పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. 
 

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు బాడీ టెంపరేచర్ ను కూడా పెంచుతుంది.  అందుకే వీటిని పచ్చిగా లేదా వంటల్లో వేసుకుని తింటుంటారు. వెల్లుల్లిలో  మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి 6 లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు సల్ఫర్ సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉల్లిపాయ

మూత్రపిండాల పేషెంట్లు తీసుకునే డైట్ లో సోడియం వాడకుండా రుచిని పెంచడానికి ఉల్లిపాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఉల్లిపాయలను చేర్చడం వల్ల ఉప్పును బాగా తగ్గించొచ్చు. దీనివల్ల వంటకాల రుచి ఏ మాత్రం తగ్గదు. వెల్లుల్లి, ఆలివ్ నూనెతో ఉల్లిపాయలను సాట్ చేయడం వల్ల మీ మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదు. 
 

ఆపిల్ పండు

ఆపిల్స్ లో పొటాషియం, భాస్వరం, సోడియం తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి మూత్రపిండాల రోగులకు బెస్ట్ ఫుడ్స్ అంటారు. ఆపిల్స్ ను తింటే మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. మూత్రపిండాల సమస్యలను కూడా ఆపిల్స్ తగ్గించడానికి సహాయపడతాయి.
 

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఫోలేట్, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్, థియోసైనేట్స్ ఉంటాయి. కణ త్వచాలు, డిఎన్ఎను దెబ్బతీసే విష పదార్థాలను తటస్తం చేయడానికి కాలెయానికి ఈ సమ్మేళనాలు సహాయపడతాయి. 
 

click me!