నిద్ర
మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు. మొత్తం ఆరోగ్యానికి కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరమని చాలామంది నమ్ముతారు.
కానీ జపాన్‌లో ఒక వ్యక్తి 10 సంవత్సరాలకు పైగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడని చెబితే మీరు నమ్ముతారా? నిజమే. డైసుకే హోరి అనే జపనీస్ వ్యక్తి తన జీవితాన్ని ‘రెట్టింపు’ చేసుకోవడానికి రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోయే కఠినమైన దినచర్యను పాటిస్తున్నారు. ఈ పద్ధతి తన పనితీరును బాగా పెంచిందని ఆయన చెబుతున్నారు. అయితే, చాలా తక్కువ నిద్ర ఆరోగ్యకరమా?
డైసుకే హోరి
తక్కువ నిద్ర
డైసుకే హోరి అనే జపనీస్ వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకోవడానికి రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు.పశ్చిమ జపాన్‌లోని హైగో ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్త, తన శరీరం, మెదడు తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా శిక్షణ పొందాయని చెబుతున్నారు. ప్రతిరోజూ ఎక్కువ చురుకైన సమయాన్ని పొందేందుకు 12 ఏళ్ల క్రితం నిద్ర సమయాన్ని తగ్గించుకుంటూ వచ్చానని ఆయన చెప్పారు.
భోజనం చేయడానికి ఒక గంట ముందు మీరు వ్యాయామం చేసినా లేదా కాఫీ తాగినా, మీరు నిద్రను నిరోధించవచ్చు" అని డైసుకే చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
డైసుకే హోరి
జపాన్‌లోని యోమియూరి టీవీలో ‘విల్ యు గో విత్ మీ’ అనే రియాలిటీ షోలో డైసుకే వ్యాఖ్యలను మరింత లోతుగా పరిశీలించడానికి మూడు రోజుల పాటు ఆయనను దగ్గరగా అనుసరించింది. ఈ ఎపిసోడ్‌లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయి, ఉత్సాహంగా లేచి, అల్పాహారం తీసుకుని, ఆఫీసుకు వెళ్లి, జిమ్‌కి కూడా వెళ్లారు.
ఈ పద్ధతి తన పనితీరును బాగా పెంచిందని, ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే దృష్టి కేంద్రీకరించినప్పుడు నాణ్యమైన నిద్ర ముఖ్యమని డైసుకే హోరి అన్నారు. “తమ పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్ర ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, వైద్యులు, అగ్నిమాపక సిబ్బందికి తక్కువ విరామ సమయాలు ఉంటాయి, కానీ అధిక పనితీరును కొనసాగిస్తారు" అని ఆయన అన్నారు.
డైసుకే 2016లో జపాన్ షార్ట్ స్లీపర్స్ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఆరోగ్యం, నిద్రపై తరగతులను అందిస్తుంది. 2,100 మందికి పైగా విద్యార్థులు ఇప్పటివరకు అల్ట్రా షార్ట్ స్లీపర్‌లుగా మారడానికి శిక్షణ పొందారు.
నిద్ర
శిక్షణ తర్వాత ఆయన విద్యార్థి ఒకరు యోయిమురి టీవీతో మాట్లాడుతూ తన నిద్రను ఎనిమిది గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గించుకున్నానని, గత నాలుగేళ్లుగా మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు.
కానీ ఈ తక్కువ నిద్ర విధానం సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించింది. ఈ అల్ట్రా-షార్ట్ నిద్ర విధానంలో చాలా ప్రతికూల అంశాలు ఉన్నాయని, ఇది అందరికీ అనుకూలించకపోవచ్చని వైద్యులు అంటున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, కొంతమందికి మాత్రమే జన్యుపరమైన ఉత్పరివర్తన ఉంది, ఇది రాత్రి ఐదారు గంటలు మాత్రమే నిద్రపోయినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ జన్యుపరమైన ఉత్పరివర్తన చాలా అరుదు; 25,000 మందిలో ఒకరికి మాత్రమే ఈ జన్యువు ఉంటుంది. మిగిలిన వారంతా రాత్రికి ఏడు గంటలు నిరంతరాయంగా నిద్రపోవాలని పరిశోధకులు తెలిపారు.
పుట్టిన 3 నెలల వరకు శిశువులు 14-17 గంటలు నిద్రపోవాలి. 4-12 నెలల వరకు శిశువులు 12-16 గంటలు నిద్రపోవాలి. 1 - సంవత్సరం వరకు పిల్లలు 11-14 గంటలు నిద్రపోవాలి. 3-5 సంవత్సరాల వరకు పిల్లలు 10-13 గంటలు నిద్రపోవాలి.
నిద్ర
6-12 సంవత్సరాల వరకు పిల్లలు 9-12 గంటలు నిద్రపోవాలి. 13-17 సంవత్సరాల వరకు పిల్లలు 8-10 గంటలు నిద్రపోవాలి. 18-60 సంవత్సరాల వరకు పెద్దలు 7 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోవాలి. 61 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 7 నుండి 9 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పెద్దలు ప్రతిరోజూ ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రపోవాలని.... నిద్ర శరీరం, మెదడు రెండింటినీ పునరుద్ధరించడానికి, మరమ్మతు చేయడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక నిద్ర లేమి జ్ఞాపకశక్తి సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి, మానసిక స్థితి రుగ్మతలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.