తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. న్యాయస్థానం తీర్పు అనంతరం ప్రణయ్ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని తండ్రి బాలస్వామి అన్నారు. చంపడం అనేది కరెక్ట్ కాదని.. తమకు ఎవరి మీద కోపం లేదని చెప్పారు. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగాలని కోరుకున్నారు.