మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ బాటిల్‌లోనే నీటిని తాగుతారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. శరీరంలోకి ప్లాస్టిక్ అవశేషాలు వెళ్లడానికి ప్రధాన కారణాల్లో ఈ బాటిల్స్‌లో నీరు తాగడం ఒక కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో ఆరోగ్యంపై అవగాహన ఉన్న వారు ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్స్‌ను నీటిని తాగేందుకు ఆసక్తి చూపించరు.
వీటికి బదులుగా రాగి లేదా స్టీల్ బాటిల్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏంటనే సందేహం రావడం సర్వసాధరణం. మరి ఈ రెండింటిలో ఏ బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.? మరి ఈ రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..