Dhanashree Verma ఎప్పుడూ ఆడవాళ్లనే నిందిస్తారా? ధనశ్రీ వర్మ ఆక్రోషం!

Published : Mar 11, 2025, 10:25 AM IST
Dhanashree Verma ఎప్పుడూ ఆడవాళ్లనే నిందిస్తారా? ధనశ్రీ వర్మ ఆక్రోషం!

సారాంశం

క్రికెటర్ యుజువేంద్ర చాహల్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ విడిపోయాక ఆ బంధంపై ధనశ్రీ వర్మ ఇప్పటివరకు ఒక్కసారి కూడ నోరు విప్పలేదు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో యుజువేంద్ర ఆర్జే మహవష్ తో కనిపించాక తొలిసారి సామాజిక మాధ్యమ వేదికగా తన వాయిస్ వినిపించింది. 

ధనశ్రీ వర్మ పోస్ట్: ఒకవైపు దేశమంతా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంబరాల్లో ఉంటే, మరోవైపు క్రికెటర్ యుజువేంద్ర చాహల్ గురించి కూడా అంతే చర్చ నడుస్తోంది. ఫైనల్ ఛాహల్ సోషల్ మీడియా స్టార్ ఆర్జే మహవష్‌తో జంటగా కనిపించాడు. దీంతో చాహల్-వర్మ విడిపోవడానికి ఈ అమ్మాయే కారణం అని రూమర్లు మొదలయ్యాయి. అంతకుముందు ధనశ్రీ కారణంగానే వాళ్లు విడిపోయారని వార్తలు వచ్చాయి. వీటిపై ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సీక్రెట్ స్టోరీని షేర్ చేస్తూ, 'ప్రతిసారీ ఆడవాళ్లను నిందించడం ట్రెండింగ్ లో ఉంటుంది' అని రాసుకొచ్చారు. ఈ స్టోరీ ద్వారా ధనశ్రీ ఈ విడాకులకు తనను, ఆడవాళ్లు మాత్రమే నిందిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ధనశ్రీ, యుజువేంద్ర చాహల్ రిలేషన్‌లో గ్యాప్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ధనశ్రీని చాలామంది తిట్టారు. కానీ ఆమె ఎప్పుడూ నోరు విప్పలేదు. ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టారు.

ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చున్న చాహల్, మహవష్ సరదాగా, సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాహల్ లేయర్డ్ దుస్తుల్లో కనిపించగా, మహవష్ క్యాజువల్ లుక్‌లో కనిపించారు. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చాహల్, మహవష్‌ల స్నేహం కొత్తదా? అంటే కానేకాదు.. యుజువేంద్ర చాహల్, ఆర్జే మహవష్ ఒకరికొకరు ముందు నుంచే తెలుసు. చాహల్, మహవష్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతారు. వీరి స్నేహం కొత్త కాదు. మహవష్ 2022లో చాహల్‌ను ఇంటర్వ్యూ చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ వేడుకల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాహల్, ధనశ్రీల రిలేషన్‌పై రూమర్స్ వచ్చాయి. ఫోటో వైరల్ కావడంతో మహవష్ రూమర్స్‌ను ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో  'ఒకమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే, వాళ్లు డేటింగ్ చేస్తున్నారని అర్థమా? ఇది ఏ సంవత్సరం నడుస్తోంది? నేను గత రెండు మూడు రోజులుగా ఓపికగా ఉన్నాను. కానీ నా పేరును ఏ పీఆర్ టీమ్ లాగడానికి నేను ఒప్పుకోను. కష్ట సమయంలో ప్రజలను వారి కుటుంబం, స్నేహితులతో ప్రశాంతంగా ఉండనివ్వండి' అని రాసుకొచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డయాబెటిస్ ఉంటే వీటిని కచ్చితంగా తినాలట
రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?