మీరు ఎప్పుడైనా గమనించారా..? కొందరికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు చాలా పొడవుగా ఉంటుంది. అలా ఉంటే అందరి మీదా వాళ్లే పెత్తనం చేస్తారని.. ముఖ్యంగా స్త్రీలకు అలా ఉంటే భర్తను నోరు తెరవనివ్వరు అని, పెద్ద గయ్యాళి అని ఇలా.. చాలా చెబుతూ ఉంటారు. నిజంగా అలా ఉంటే ఏంటి..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? ఈ విషయంపై నిజానికి చాలా పరిశోధనలు చేశారట. మన పాదాల ఆకృతి కి మన వ్యక్తిత్వ లక్షణాలతో దగ్గర సంబంధం ఉంటుందట. మన పాదాల వంపు దగ్గర నుంచి.. మన కాలి ఆకారం వరకు.. మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా చెప్పేస్తుందట. మరి.. బొటన వేలు కంటే.. పక్కన వేలు ఎక్కువ పొడవుగా ఉంటే ఆ వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ పాదానికి ఉన్న అన్ని వేళ్లు సమానంగా ఉన్నాయి అంటే.. మీరు చాలా నమ్మకమైన వ్యక్తులు అని అర్థం. మీరు జీవితంలో చాలా కష్టపడే వ్యక్తిత్వం కలవారు అని కూడా అర్థం. మీరు మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయడంలో.. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో ముందుంటారు. ఎవరికైనా మాట ఇస్తే.. ఆ మాటను కచ్చితంగా నిలపెట్టుకుంటారు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు కూడా.
toes
ఇది రెండో రకం.. మీ బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు.. ఈ మూడు ఒకే ఎత్తులో ఉండి.. మిగిలిన రెండు మాత్రం చిన్నగా ఉన్నాయి అంటే... మీ పాదాన్ని రోమన్ పాదం అంటారు. ఇలాంటి పాదాలు ఉన్నవారు అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. చాలా దయతో ఉంటారు. వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. పరిచయం అయిన అందరితోనూ కమ్యూనికేషన్ ని కంటిన్యూ చేస్తారు. లైఫ్ లో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు.
ఇది మరో రకం.. మీ కాలి బొటన వేలు ఒక్కటే కాస్త పొడవుగా ఉండడి.. మిగిలిన నాలుగు వేళ్లు మాత్రం.. 45 డిగ్రీల కోణంలో స్లయిడ్ స్లాంట్‌లో ఉంటే, మీరు ఈజిప్షియన్ ఫుట్ ఆకారాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక స్వతంత్ర ఆలోచనాపరులు. మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు. కాస్త మొండిగా ఉంటారు. చాలా నమ్మకమైన వ్యక్తులు. ఇతరులను కూడా బాగా అర్థం చేసుకుంటారు. వీరికి ఎవరైనా సీక్రెట్ చెబితే.. ప్రాణం పోయినా ఆ సీక్రెట్ ని బయటపెట్టరు.
ఇక చివరగా.. అసలైంది.. మీ బొటనవేలు కంటే.. దాని పక్కన రెండో వేలు పెద్దదిగా ఉంది అంటే.. మీది గ్రీకు పాదం అని అర్థం. దీనినే ఫైర్ పుట్ ఆకారం అని కూడా పిలుస్తారు. ఈ పాదం ఉన్నవారు.. సహజంగా చాలా ఎమోషనల్ పర్సన్స్. చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరు చాలా శక్తివంతంగా ఉంటారు. వీరు చాలా సాహసంగా ఉంటారు. వీరు జీవితంలో చాలా గొప్ప స్థానానికి చేరుకుంటారు. జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంతైనా కష్టపడతారు.