కరోనా వైరస్ ప్రభావంతో లైంగిక సంబంధాలపై, శారీరక ఆరోగ్యంపై ఒత్తిడి తీవ్రమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం ప్రత్యక్షంగా ఉన్నట్లు చెబుతున్నారు. రతిక్రీడ వల్ల కరోనా వైరస్ ఒత్తిడిని అధిగమించడానికే కాకుండా వయోజనుల కార్డియోవాస్క్యులర్ వ్యవస్థ మెరుగుకు కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు.
undefined
తరుచుగా లైంగిక క్రీడలో పాల్గొనడం వల్ల మానసిక ఆరోగ్యం మెరగవుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ కాలంలో జోరుగా లైంగిక కార్యకలాపాలు పెరుగుతాయని భావించామని, అయితే అది చాలా తక్కువ స్థాయిలో ఉందని యూకేలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడిస్తోంది.
undefined
తక్కువ స్థాయి లైంగిక క్రీడకు కారణం దానిపై ఆసక్తి లేకపోవడం కాదని, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పెరిగిన ఒత్తిడి కారణమని చాలా మంది చెప్పినట్లు ఆ సర్వే తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి వల్ల పెరిగిన భయాందోళనల వల్ల లైంగిక క్రీడకు దూరమవుతున్నట్లు వారు తెలిపినట్లు సర్వే వెల్లడించింది.
undefined
దానికితోడు, అవివాహితులు తమ లైంగిక భాగస్వాములను కలుసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆన్ లైన్ యాప్స్ ద్వారా జరిగే క్యాజువల్ సెక్స్ ను కూడా వారు చేయలేకపోతున్నారని తేలింది. మహమ్మారి నిస్పృహకు గురి చేసి, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోందని, సుదీర్ఘమైన ఐసోలేషన్ ప్రతికూల ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు.
undefined
మహమ్మారి కారణంగా ఎదురైన పరిస్థితుల వల్ల చాలా మంది ఆందోళనకు, డిప్రెషన్ కు, ఆగ్రహానికి, బోర్ డమ్ కు, నిస్పృహకు గురవుతున్నట్లు తేలింది. నిజానికి రతిక్రీడ ఆందోళనను, ఒత్తిడిని తగ్గిస్తుంది. కనీసం రెండు వారాలకు ఒక్కసారైనా లైంగిక క్రీడలో పాల్గొన్నవారు ఒత్తిడి నుంచి కొంత మేరకు బయటపడినట్లు స్కాట్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ పరిశోధనలో తేలింది.
undefined
లైంగిక క్రీడలో పాల్గొనాలని చెప్పడం సులభమే కానీ ఇంటి పనులు, ఆఫీసు పనులు, ఇంట్లో పిల్లల బాగోగులు చూసుకోవడం, రోజువారీ పనులు వెంటాడుతూనే ఉంటాయి. దానికితోడు కరోనా వైరస్ భయాందోళనలు చుట్టుముట్టాయి. కరోనా చుట్టుముట్టక ముందు ఇద్దరు ఉద్యోగాలు చేసేవారైతే కలుసుకునే సమయాలు కూడా తక్కువ ఉంటూ వచ్చాయి. ఈ స్థితిలో ఇద్దరికి ఒకే సమయంలో కోరిక జనించాలని ఏమీ లేదు. దీన్ని అధిగమించాల్సి ఉంటుంది.
undefined
ప్రస్తుత పరిస్థితుల్లో భయాందోళనలను అధిగమించి, మహమ్మారిని తట్టుకోవడానికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ అండ్ ద అమెరికన్ సెక్సువల్ హెల్త్ అసోసియేషన్ (ఏఎస్ హెచ్ఏ) సేఫ్ సెక్స్ కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. అయితే, భౌతిక దూరానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను పాటిస్తూనే లైంగిక జీవితంలో సంతృప్తి పొందడానికి మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు.
undefined
ఏఎస్ హెచ్ఏ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. హస్త ప్రయోగం కోవిడ్ -19ను వ్యాపింపజేసే అవకాశం లేదు. సెక్స్ టాయ్స్ ను వాడడానికి ముందు, వాడిన తర్వాత మీ చేతులను సబ్బుతో, నీళ్లతో శుభ్రంగా కడుక్కోండి.
undefined
మీ సురక్షితమైన లైంగిక భాగస్వామి మీతో పాటు ఉండే మీ భర్తభార్య. కొత్తవారితో లైంగిక జీవితంలో ప్రయోగం చేసే కాలం కాదు ఇది. నోటిలో నోరు పెట్టడం, మర్మాంగాలను చుంబించడం వంటి క్రియలను వదులుకోవాలి.
undefined
ఇద్దరు భాగస్వాములు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు నిర్ధారణ చేసుకోవాలి. రతిక్రీడ తర్వాత మీలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. లైంగిక క్రీడకు విరామం ఇవ్వాలి.
undefined
అవాంఛనీయమైన గర్భాలను, లైంగిక సంబంధమైన వ్యాధులను దూరం పెట్టడానికి కండోమ్స్ లేదా ఇతర పద్ధతులను వాడండి. మీతో జీవించే వ్యక్తితో కూడా బయటివారితో లైంగిక క్రీడకు దూరంగా ఉండండి. కరోనా వైరస్ మహమ్మారిని గొలుసును తెంచేయడానికి భౌతిక దూరం ఎంతైనా అవసరం.
undefined