
బరువు తగ్గడానికి వీలైనంత వరకు చాలా మంది వ్యాయామం చేస్తూ ఉంటారు. జిమ్ లో చేరి చెమటలు చిందిస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. మనం సరైన క్రమంలో… ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. బరువు తగ్గడం చాలా సులభం.
వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా తమ డైట్ లో ప్రోటీన్ తీసుకోవాలి. నాన్ వెజ్ ప్రియులు చికెన్, చేపలు తింటే వారికి ప్రోటీన్ అందుతుంది. మరి, వెజిటేరియన్స్ బరవు తగ్గాలంటే అది కూడా వెజ్ లో ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి? ఎంత తీసుకోవాలో చూద్దాం…
ప్రతిరోజూ 1500 కేలరీలు మించకుండా ఆహారం తీసుకుంటూ.. అందులోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా చూసుకుంటే.. బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది.
ఇక్కడ ఇచ్చిన ఆహారం 62 కిలోల బరువున్న వ్యక్తి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వ్యక్తి బరువు పెరిగితే, రోజువారీ కేలరీల తీసుకోవడం కూడా పెరుగుతుంది.
కార్బోహైడ్రేట్లు - 132 గ్రాములు
కొవ్వు - 50 గ్రాములు
ప్రోటీన్ - 84 గ్రాములు
మీ రోజువారీ అల్పాహారంలో ఈ ఆహారాన్ని చేర్చండి
1 స్లైస్ బ్రెడ్
1 టీస్పూన్ వేరుశెనగ వెన్న
300 ml స్కిమ్డ్ పాలు
1 ఆపిల్
1 స్కూప్ ప్రోటీన్ పౌడర్ (20 గ్రాముల కంటే ఎక్కువ కాదు) నీటితోనే తీసుకోవాలి.
మీ మధ్యాహ్న భోజనంలో ఈ ఆహారాలను చేర్చుకోండి
100 గ్రాముల వండిన తెల్ల బియ్యం
30 గ్రాముల వండిన పప్పు
160 గ్రాముల కాలీఫ్లవర్ కూర
100 గ్రాముల వండిన టోఫు
మీ మధ్యాహ్నం స్నాక్స్…
120 ml టీ/కాఫీ
మీకు నచ్చిన 1 లేదా 2 బిస్కెట్లు
రాత్రి భోజనం కోసం ప్రోటీన్ ఆహారం
1 రొట్టె (35 గ్రాములు)
30 గ్రాముల వండిన పప్పు
160 గ్రాముల కాలీఫ్లవర్ కూర
75 గ్రాముల జున్ను
100 గ్రాముల పెరుగు
ఈ ఆహారం తీసుకోవడం ద్వారా రోజుకు 1500 కేలరీలు పొందవచ్చు. ఈ ఆహారంతో పాటు.. తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారు.