రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తోంది. రీఛార్జ్ ప్లాన్స్ మాత్రమే కాకుండా తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్స్ తో సెల్ ఫోన్లు కూడా తయారు చేస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ఇప్పటికే కేవలం రూ.999 లకు కీప్యాడ్ ఫోన్ తీసుకొచ్చింది. అదేవిధంగా రూ.5000 లకే బెస్ట్ ఫీచర్స్ తో 5 జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసి పోటీదారులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు 2025 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు గాను వినియోగదారులకు ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ ను అందిస్తోంది.
న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మధ్యలో రీఛార్జ్ చేసుకున్న వారు భారీగా సేవింగ్స్, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేయడానికి రూ.2025 పే చేయాలి.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 200 రోజులు. అప్పటి వరకు అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు మీరు పొందవచ్చు. అంతేకాకుండా రోజుకు 2.5 GB డేటా చొప్పున 500 GB 4జీ డాటా కూడా వస్తుంది.
న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు అపరిమితమైన SMSలు పంపేందుకు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్ లో అవకాశం ఉంది.
న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే పార్టనర్ కూపన్ల రూపంలో రూ. 2150 విలువైన అదనపు ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు.
Ajioలో రూ.2,500 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేస్తే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. Swiggyలో రూ.499 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.150 తగ్గింపు పొందవచ్చు. Easemytrip.comలో ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. MyJio యాప్ ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు.
న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ మంత్లీ రీఛార్జ్ అయిన రూ.349 ప్యాకేజీతో పోలిస్తే రూ.468 సేవింగ్స్‌ను అందిస్తుంది. ఇది లిమిటెడ్ ఆఫర్. డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు మాత్రమే అందుబాటుతో ఉంటుంది. వినియోగదారులు జియో వెబ్‌సైట్, యాప్ లేదా ఆథరైజ్డ్ రీటైలర్ల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.