చలికాలంలో ఈ చిన్న పండ్లు తింటే ఏన్ని లాభాలో తెలుసా?

First Published | Dec 12, 2024, 11:39 AM IST

ఈ  చలికాలంలో వీటిని రోజూ తినడం వల్ల చర్మం మెరుస్తూ కనపడేలా చేస్తుందట. ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం

ఈ సీజన్ లో మనకు ఎక్కువగా లభించే పండ్లలో రేగి పండ్లు ముందు  వరసలో ఉంటాయి.  రేగిపండ్లు చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉంటాయి. కానీ.. వీటిని తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయట. మరి… ఈ చలికాలంలో ఈ రేగి పండ్లను రోజూ తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా నారింజ పండ్లలో విటమిన్ సి ఉంటుందని మనకు తెలుసు. కానీ..  వాటికి మించిన విటమిన్ సి ఈ చిన్న రేగి పండ్లలో ఉంటుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. రేగి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఈ  చలికాలంలో వీటిని రోజూ తినడం వల్ల చర్మం మెరుస్తూ కనపడేలా చేస్తుందట. ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం

Tap to resize

indian jujube

రేగి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.  యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్,పాలీశాకరైడ్లు కూడా ఉంటాయి. 

నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి కాబట్టి ఔషధాలలో కూడా వాడతారు. ఈ పండు మెదడు పనితీరును కూడా పెంచుతుంది. పండు విత్తనాల నుండి తీసిన నమూనాలను పరీక్షించినప్పుడు, అవి మనం నిద్రపోయే సమయాన్ని పెంచుతున్నాయని తేలింది. ఈ శీతాకాలపు పండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లింగన్‌బెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. పండులోని పీచు మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది.

indian jujube

ఈ రేగి పండ్లలో ఉప్పు తక్కువగా ఉంటుంది .పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నాడీ వ్యవస్థ, మెదడు విధులను నియంత్రిస్తుంది ఆందోళనను తగ్గిస్తుంది.

Latest Videos

click me!