పిల్లలకు డైపర్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చాలి..?

By ramya Sridhar  |  First Published Dec 11, 2024, 12:53 PM IST

ఒకవేళ పిల్లలకు డైపర్లు వేసినా వాటిని ఎన్ని గంటలకు ఒకసారి మారుస్తూ ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…


ఈ రోజుల్లో పిల్లలను పెంచడం అంత ఈజీ కాదు. పిల్లలను కనడంతోనే అయిపోదు.. వారిని పెంచడం, చదివించడం, వాళ్లు కెరీర్ లో ఎదిగేంత వరకు వారికి తోడుగా నిలపడటం చాలా అవసరం. పిల్లలకు ఐదేళ్ల వయసు దాటినప్పటి నుంచి.. వారికి ఏం చేయాలి? ఏం చేయకూడదు లాంటివి చెప్పడం చాలా ఈజీ. కానీ.. అంతకంటే చిన్న పిల్లలకు మనం చెప్పే విషయాలు పూర్తిగా అర్థంకాకపోవచ్చు.  ముఖ్యంగా సంవత్సరంలోపు పిల్లలకు అయితే ఏమీ నేర్పించలేం.  వారికి మూత్ర, మల విసర్జన గురించి  సరైన అవగాహన ఉండదు. అందుకే.. వారికి డైపర్లు వేస్తూ ఉంటాం. కానీ.. పిల్లలకు నిజంగా డైపర్లు వేయడం కరెక్టేనా? ఒకవేళ పిల్లలకు డైపర్లు వేసినా వాటిని ఎన్ని గంటలకు ఒకసారి మారుస్తూ ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

పిల్లలకు డైపర్లు అవసరమా?

Latest Videos

పిల్లలకు డైపర్లు వాడేవారు చాలా మంది ఉన్నారు. అయితే…  ఈ మధ్యకాలంలో డైపర్లు మాత్రమే కాకుండా..  రీ యూజబుల్ క్లాత్ డైపర్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. వాటిని వాడటం చాలా మంచిది.  వాటిని ఉపయోగించిన తర్వాత వాష్ చేసి.. ఎండలో ఆరబెట్టి.. మళ్లీ వాడుకోవచ్చు.

డైపర్లు ఎంత సేపటికి మార్చాలి..?

నవజాత శిశువులకు క్లాత్ డైపర్లను గంటకు ఒకసారి మార్చండి. 4-5 నెలల పిల్లలకు, ప్రతి 3-4 గంటలకు క్లాత్ డైపర్లను మార్చడం సరిపోతుంది.డైపర్‌లోని జెల్ తేమను గ్రహిస్తుంది. డైపర్ సింథటిక్ పాలిమర్‌లు ,సెల్యులోజ్ ఫైబర్‌లతో తయారు చేస్తారు.

డైపర్ వాడకంతో సమస్య ఉందా?

శిశువు మూత్రం 2-3 గంటల వరకు ఎటువంటి సమస్యను కలిగించదు. కానీ అతను మలవిసర్జన చేస్తే, డైపర్ జెల్ ,మలం మిక్స్ ,రసాయన ప్రతిచర్య సంభవిస్తుంది, దీని వలన శిశువులో డైపర్ ర్యాషెస్ ఏర్పడతాయి. కాబట్టి పిల్లల వయస్సు ఆధారంగా, రోజుకు 5-6 డైపర్లు లేదా క్లాత్ న్యాప్‌కిన్‌లను మార్చాలి.

పిల్లలకు ఎక్కువ సేపు డైపర్లు వేసి ఉంచడం మంచిది కాదు. పిల్లలకు వెంటిలేషన్ కూడా చాలా అవసరం. డైపర్ వేయడానికి ముందు  చర్మానికి కొబ్బరి నూనె రాయాలి.  మీ బిడ్డ మూత్రం, మలాన్ని తుడిచివేయడానికి బేబీ వైప్‌లను ఉపయోగించే బదులు, మీరు వాటిని తడిగా ఉన్న కాటన్ క్లాత్‌తో తుడవవచ్చు.

 

click me!