2024లో ఇండియాలో హాట్ టాపిక్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే?

First Published | Dec 12, 2024, 11:32 AM IST

Indias most searched sports person 2024: 2024లో గూగుల్ లో టాప్ 10 సెర్చ్డ్ ఇండియన్ పర్సనాలిటీస్ లో ఐదుగురు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి స్టార్ క్రికెటర్లు ఈ లిస్టులో లేకోవడం గమనించాల్సిన విషయం.

ఎక్కువగా వెతికిన స్పోర్ట్స్ పర్సన్

అనేక సంఘటనలు, ఆవిష్కరణలు, వేడుకలు, ఆటగాళ్ల రికార్డులకు వేదికైన 2024 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే అందరూ 2025కి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, 2024లో ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు? భారత్ లో ఎక్కువగా ప్రజలు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? ఇవి మీకు ఆసక్తిగా అనిపిస్తున్నాయి కదా ! ఇప్పుడు ఆ వివరాలనే తెలుసుకుందాం. గూగుల్ ఇండియాలో ఎక్కువగా వెతికిన వ్యక్తుల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఇందులో రెజ్లర్, పొలిటీషియన్ అయిన వినేష్ ఫోగట్ 2024 లో గూగుల్ లో ఎక్కువగా వెతికిన వ్యక్తిగా నిలిచారు. 

హార్దిక్ పాండ్యా

2024లో టాప్ 10 సెర్చ్డ్ ఇండియన్ పర్సనాలిటీస్ లో వినేష్ ఫోగట్ తో కలిపి మొత్తం ఐదుగురు  స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. అయితే, ఈ లిస్టులో ఏవరూ భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి వారు లేరు. అయితే, భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో నిలిచారు.

హార్ధిక్ పాండ్యా ఫామ్, విడాకులు, ఐపీఎల్ కెప్టెన్సీ వంటి అంశాలతో అతను గూగుల్ లో వెతికిన టాప్ 10 పర్సనాలిటీస్ లో ఒకరిగా ఉన్నారు. సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ తో విడాకులు తీసుకోవడం వల్ల హార్ధిక్ పేరు గూగుల్ సెర్చ్ లో బాగా పెరిగింది. అలాగే, ఐపీఎల్ లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది.

Tap to resize

నీరజ్ చోప్రా

ఆశ్చర్యకరంగా, 2024 పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన నీరజ్ చోప్రాతో సహా ఆరుగురు ఒలింపిక్ మెడలిస్టులో కూడా టాప్ 10 లో లేరు. వినేష్ ఫోగట్, హార్దిక్ పాండ్యాతో పాటు గూగుల్ లో ఎక్కువగా వెతికిన టాప్ 10లో ఉన్న ఇతర ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ క్రికెటర్లు శశాంక్ సింగ్ (6వ స్థానం), అభిషేక్ శర్మ (9వ స్థానం), బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ (10వ స్థానం) లు ఉన్నారు.

వినేష్ ఫోగట్

వినేష్ ఫోగట్ పారిస్ 2024 ఒలింపిక్స్ అద్భుతమైన ప్రదర్శనతో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరారు. అయితే, ఫైనల్ ఫైట్ కు కొన్ని గంటల ముందు ఆమె పోటీ నుంచి డిస్క్వాలిఫై అయ్యారు. మెడల్ ఖాయం అనుకున్న సమయంలో ఇలా జరగడంతో వినేష్ ఫోగట్ ఇండియాలో బాగా వెతికిన వ్యక్తిగా నిలిచారు. ఉమెన్స్ 50 కిలోల రెజ్లింగ్ ఈవెంట్ లో పాల్గొనే ముందు ఆమె కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉండటం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు.

రాధిక మర్చంట్

గూగుల్ లో 2024 లో ఎక్కువగా వెతికిన టాప్ 10 ఇండియన్ పర్సనాలిటీస్:

1) వినేష్ ఫోగట్

2) నీతీష్ కుమార్

3) చిరాగ్ పాస్వాన్

4) హార్దిక్ పాండ్యా

5) పవన్ కళ్యాణ్

6) శశాంక్ సింగ్

7) పూనమ్ పాండే

8) రాధిక మర్చంట్

9) అభిషేక్ శర్మ

10) లక్ష్య సేన్

Latest Videos

click me!