ఏసీ వాడకంతో కరెంట్ బిల్లు పెరిగిపోతోందా.. ఈ ట్రిక్స్ వాడి చూడండి..!

First Published May 22, 2024, 11:04 AM IST

ఏసీ వాడినా కూడా కరెంటు బిల్లు తక్కువగా రావాలి అంటే.. మంచి ట్రిక్స్ ఉన్నాయి. వాటిని వాడితే.. ఈజీగా కరెంట్ ఆదా చేయవచ్చు. 


ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూడా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. అయితే... ఏసీ ఎక్కువగా వాడితే కరెంట్ బిల్లు పేలిపోతుంది. అలా అని ఏసీ ఆఫ్ చేయలేం. ఏసీ ఆన్ చేస్తేనేమే.. కరెంట్ బిల్లు భయం పెరిగిపోతుంది. అయితే... ఏసీ వాడినా కూడా కరెంటు బిల్లు తక్కువగా రావాలి అంటే.. మంచి ట్రిక్స్ ఉన్నాయి. వాటిని వాడితే.. ఈజీగా కరెంట్ ఆదా చేయవచ్చు. 

ప్రస్తుతం మార్కెట్లోకి  5స్టార్ రేటెడ్ ఏసీలు వచ్చాయి.  వాటి వల్ల కరెంట్ బిల్లు కాస్త తక్కువగానే వస్తుంది. కానీ వాటిని సైతం ఎక్కువగా వాడితే.. బిల్లు పెరుగుతుంది. ఈ చిట్కాలు ప్రయత్నించండి.. కచ్చితంగా మీ కరెంటు బిల్లు తగ్గుతుంది.

1.చాలా మంది ఇంట్లో ఏసీ ఆన్ చేయగానే ఫ్యాన్ కూడా ఆన్ చేస్తారు. ఈ రెండూ ఒకేసారి ఆన్ చేయడం వల్ల.. ఫ్యాన్ నుంచి వచ్చే వేడి గాలికి.. రూమ్ చల్లపడటానికి సమయం ఎక్కువగా పడుతుంది. అప్పుడు ఆటోమెటిక్ గా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా.. ఏసీ ఆన్ చేసి.. రూమ్ చల్లగా అయ్యేంత వరకు ఆగాలి. ఆ తర్వాత... ఏసీ టెంపరేచర్ నార్మల్ గా పెట్టుకొని ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది.


2.
ఫ్యాన్‌కింద పడుకునే అలవాటు ఉంటే ముందుగా ఏసీ ఆన్ చేసి గదిని మూసేసి చల్లబరిచి నిద్రిస్తున్నప్పుడు ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్‌ని ఆన్ చేయండి. ఇది గదిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. 
 

3.గాలితో పాటు ధూళి, చెత్త కూడా ఏసీ ఫిల్టర్‌లోకి ప్రవేశిస్తాయి. ఇది AC డక్ట్‌ను అడ్డుకుంటుంది. ఇది దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. అది నెమ్మదిగా చల్లబడుతుంది. అందువల్ల, ఏసీ సర్వీస్‌ను పొందడం చాలా ముఖ్యం. AC పనితీరు సరిగా లేకపోతే, అది ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. కాబట్టి.. ఏసీ సర్వీసు చేయించాలి. అప్పుడు పవర్ ఆదా అవుతుంది.

కేవలం ఏసీ ఆన్ చేస్తే సరిపోదు. చాలా సార్లు మనం తీవ్రమైన వేడి నుండి వచ్చిన వెంటనే AC ఉష్ణోగ్రతను తగ్గించడం ప్రారంభిస్తాము. ఇలాంటి పరిస్థితుల్లో 16 లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఏసీని ఆన్ చేయడం వల్ల గది త్వరగా చల్లబడుతుందని భావిస్తున్నాం. కానీ ఈ విధంగా మనం ఏసీని ఎక్కువగా పనిచేసేలా చేస్తున్నాం . అదే సమయంలో మన కరెంటు బిల్లును పెంచుతున్నాము. ఎంత వేడిగా ఉన్నా 24 డిగ్రీల వద్ద ఏసీ ఉంచుకుంటే.. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే భయం ఉండదు. 
 


అదేవిధంగా, మీరు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా AC  టైమర్‌ను సెట్ చేయాలి. చాలా సార్లు రాత్రిపూట చలిగా అనిపించి బద్ధకం వల్ల కూడా లేవలేము. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. టైమర్ ఆన్ అయ్యి ఉంటే.. ఆటోమెటిక్ ఏసీ ఆఫ్ అవుతుంది. దాని వల్ల తక్కువ వినియోగిస్తాం. కరెంట్ కూడా ఆదా అవతుుంది. 


గదిలో మందపాటి కర్టెన్లను ఉపయోగించండి
గది లోపలికి సూర్యరశ్మి ఎంత ఎక్కువగా వస్తే, గదిని చల్లగా ఉంచడానికి ఏసీ అంత కష్టపడాల్సి వస్తుంది. అదేవిధంగా, మీ గదిలో సన్నని కర్టెన్లు ఉంటే, అప్పుడు వేడి ,సూర్యకాంతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ గదిలో మందపాటి కర్టెన్లు వాడటం, కిటికీలు , తలుపులు మూసివేయడం మంచిది. చాలా సార్లు పిల్లలకు తలుపులు మూసే అలవాటు ఉండదు. కాబట్టి మీరే చూసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ఏసీ వేసినా కరెంట్ బిల్లు తక్కువ వచ్చేలా చూసుకోవచ్చు.

Latest Videos

click me!