మంచివే అయినా.. ఈ యోగాసనాలు మీ గుండెను దెబ్బతీస్తాయి.. జర పైలం

First Published Feb 3, 2023, 10:59 AM IST

కొన్ని యోగాసనాలు గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. గుండెకు రక్తప్రసరణను మెరుగుపరిచి, హృదయ స్పందన రేటును అదుపులో ఉంచుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కానీ ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు గుండెకు మేలుచేసే యోగాసనాలు చేసే ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే..?  
 

యోగా ఆసనాలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. అందుకే పురాతన కాలం నుంచి ఈ యోగాసనాలను చేస్తున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గడానికి అంటూ యోగాసనాలు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు యోగాసనాలు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇంకోసం ఎన్నో భంగిమలు ఉన్నాయి. యోగాసనాలు ఎంత మేలు చేసినా.. యోగాతో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ఈ యోగాసాలను చేయకపోవడమే మంచిదంటున్నారు. ఎందుకంటే ఇవి గుండెను రిస్క్ లోకి నెట్టేస్తాయి. ఇంతకీ హార్ట్ పేషెంట్లు ఎలాంటి యోగాసనాలు వేయకూడదో  ఇప్పుడు  తెలుసుకుందాం..

virabhadrasana

వీరభద్రాసనం (యోధుడి భంగిమ)

వీరభద్రాసననం అనే యోధుడి భంగిమ గుండెకు ఉత్తమమైన యోగాసనంగా చెప్తారు. ఎందుకంటే ఇది హృదయ స్పందన రేటును అదుపులో ఉంచుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడితో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ యోగాసనం భుజం, తొడ, చీలమండ, ఛాతీ, మెడ, ఊపిరితిత్తులు, నాభి ప్రాంతాల వరకు విస్తరించి ఉంటుంది. ఈ భాగాలను బలోపేతం చేస్తుంది. అయితే మీకు ఇప్పటికే బలహీనమైన గుండె ఉంటే ఈ యోగాభంగిమను చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. 
 

అధో ముఖో స్వనాసన 

ఇది కూడా సూర్య నమస్కారాల్లో భాగమే. అధో ముఖో స్వనాసనంలో చేయి, భుజం, తొడ కండరాలు, పాదాల చుట్టూ కండరాలు విస్తరించి ఉంటాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీర ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
 

సిర్షాసన (హెడ్ స్టాండ్)

సిర్శాసనాన్ని  కూడా ఆసనాలకు రాజుగా భావిస్తారు. ఈ భంగిమలో శరీర బరువు మొత్తం తల, భుజాలపై పడుతుంది. ఈ యోగాసనంలో  గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది . హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే ఇప్పటికే బలహీనమైన గుండె ఉన్నవారికి ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది.
 

హలాసనం (నాగలి భంగిమ)

హలాసనంలో నాగలిలా కనిపించాలంటే శరీరాన్ని వంచాలి. యోగాసనంలో మీ కాళ్ళను పైకి లేపడం, ఛాతీపై ఒత్తిడి చేస్తూ దానిని తల వైపు వంచాలి. ఇది గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేసేలా చేసినప్పటికీ, గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే గుండె ఆరోగ్యం బాలేనివారు ఈ యోగాసనాన్ని అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

కర్నాపిరాసనం 

హలాసనం ఎలా చేస్తారో అదే విధంగా కర్నాపిరాసనాన్ని కూడా చేస్తారు. కానీ దీన్ని చేయడం కొంచెం కష్టం.ఇందులో మీరు మీ మోకాళ్ళను మీ చెవులకు దగ్గరగా తీసుకురావాలి. ఇది గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే ఇప్పటికే మీ గుండె బలహీనంగా ఉంటే ఈ ఆసనాన్ని వేయకపోవడమే మంచిది. 
 

చక్రాసనం 

చక్రాసనం అత్యంత కష్టమైన యోగా ఆసనాలలో ఒకటి. అ విషయం అందరికీ తెలుసా. ఈ యోగాసనాన్ని పర్ఫెక్ట్ గా వేయాలంటే కొంతకాలం సాధన చేయాల్సిందే. చక్రాసనం శరీరంలోని ప్రధాన భాగాన్ని విస్తరించి, ఊపిరితిత్తులు, గుండె వంటి అనేక ప్రధాన అవయవాలను ప్రభావం చూపెడుతుంది. అలాగే ఇతర అవయవాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. గుండె ఆరోగ్యం బాలేని వారు ఈ యోగాసనాన్ని చేయకపోవడమే ఉత్తమం. 


భుజంగాసనం (నాగుపాము భంగిమ)

భుజంగాసన యోగా భంగిమలో శరీరాన్ని సక్రమంగా సాగదీసి శరీరాన్ని నాగుపాములా కనిపించేలా చేయాలి. దీనిలో కడుపుపై పడుకుని కాళ్లను కలిపి ఉంచి లోతైన శ్వాస తీసుకుంటూ శరీరం పైభాగాన్ని పైకి లేపాలి. ఈ యోగా భంగిమ కడుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా గుండె సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

click me!