రాజమౌళి జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు... నిందలు, అవమానాలు... మరోసారి సచ్చినా చేయడు!

First Published May 8, 2024, 7:13 AM IST

రాజమౌళికి మిస్టర్ పర్ఫెక్ట్ అనే ట్యాగ్ ఉంది. ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. అసలు కాంప్రమైజ్ కాడు. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. అయితే జీవితంలో రాజమౌళి అతిపెద్ద తప్పు చేశాడు. అది ఆయన్ని ఎంత కాలం వెంటాడుతుందో అర్థం కావడం లేదు. 
 

Rajamouli


రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడు. తన సినిమాలకు గొప్ప కథలను ఎంచుకునే రాజమౌళి.. అంతే గొప్పగా తెరకెక్కిస్తాడు. ఆడియన్స్ ఫల్స్ తెలిసిన మాస్ డైరెక్టర్. రాజమౌళితో సినిమా అంటే హిట్ అండ్ ప్లాప్ అనే చర్చ ఉండదు. కేవలం రికార్డుల  గురించే మాట్లాడుకుంటారు. 

రాజమౌళి హీరోల ఎంపిక కూడా నిబద్దతతో కూడుకుని ఉంటుంది. కథకు సరిపడే హీరోలతో పాటు తనకు సహకరించే వాళ్ళతోనే సినిమాలు చేశాడు. అందుకే దర్శకుడిగా చేసిన 12  సినిమాల్లో అత్యధికంగా ఎన్టీఆర్ తో 4, ప్రభాస్ 3, రామ్ చరణ్ తో 2 సినిమాలు చేశాడు. నాని, రవితేజ, సునీల్ లతో ఒక్కో సినిమా చేశారు. 


కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీకి నందమూరి-మెగా హీరోలను ఎంచుకుని ఆయన అతిపెద్ద మిస్టేక్ చేశాడనే వాదన మొదలైంది. ఇండస్ట్రీ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ అయినప్పటికీ.. దీని సైడ్ ఎఫెక్ట్స్ చూశాక.. రాజమౌళికి తాను తప్పు చేశానన్న భావన కలగక మానదు. 


ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు ముందే ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల్లో ఎవరి పాత్ర గొప్పగా ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ లో భీమ్ పాత్ర ఇన్నోసెంట్ గా ఉంటే రామ్ పాత్ర అతన్ని గైడ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి గట్టి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. 
 

వెరసి రాజమౌళికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ మొదలైంది. ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపుతావా.... అంటూ సోషల్ మీడియాలో బూతు కామెంట్స్ తో ఏకిపారేశారు. కొందరైతే తిడుతూ రాజమౌళి ఫోన్ కి సందేశాలు పంపారని సమాచారం. అప్పుడు మొదలైన ఆర్ ఆర్ ఆర్ వివాదం నడుస్తూనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలై 2 ఏళ్ళు అవుతున్నా చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్... కొట్టుకుంటూనే ఉన్నారు. 

నిన్న బాహుబలి చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఆర్ ఆర్ ఆర్ లో ఒక హీరోని ఎక్కువగా మరొక హీరోని తక్కువగా చూపించారనే వాదన మీద స్పందించాలని ఓ విలేకరి అడిగారు. రాజమౌళి ఈ ప్రశ్నకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. సందర్భం కాదని దాట వేశాడు. 

కథకు న్యాయం చేస్తూనే ఎన్టీఆర్-రామ్ చరణ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించాడు. కానీ నందమూరి-మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఉన్న వైరం లేని వివాదం రాజుకునేలా చేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఫ్యాన్ వార్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. చరణ్ కి అవార్డు ఇచ్చిన వాళ్లు ఎన్టీఆర్ కి ఎందుకు ఇవ్వరని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలదీయడంతో సదరు అవార్డుల సంస్థ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

RRR

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ 2 ఆలోచన రాజమౌళి చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో చేయకపోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ ఆయనకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఫ్యాన్స్ నుండి అవమానాలు, నిందలు పడాల్సి వచ్చింది. రాజమౌళి ఇకపై నందమూరి-మెగా హీరోల మల్టీస్టారర్స్ జోలికి పోకూడనిదని నిర్ణయించుకున్నారనే వాదన మొదలైంది... 

click me!