సుకుమార్ ప్రమోట్ చేస్తున్నా కలెక్షన్స్ లేవేంటి,కారణం?

By Surya PrakashFirst Published May 8, 2024, 6:24 AM IST
Highlights

ఆల్ మోస్ట్ 70% కి పైగా డ్రాప్స్ ను 4వ రోజు నుంటి మొదలైన ఈ సినిమా ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లోనే.. షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా ..


సుకుమార్ వంటి స్టార్ డైరక్టర్ ఓ చిన్న సినిమా గురించి చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందని భావించి జనం చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. కలెక్షన్స్ అదిరిపోతాయి. కానీ సుహాస్ తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)కు అదేమీ జరగటం లేదు.  ఎలక్షన్స్ సీజన్ అనో, ఎండలు మండిపోతన్నాయనో.... లేక ఓటిటి రిలీజ్ ఎదురుచూస్తున్నారో కానీ సినిమా కలెక్షన్స్ అయితే  కనపడటం లేదు.

సుహాస్ ని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)రిలీజ్ ముందు నుంచి కూడా మంచి బజ్ ఏర్పడింది.సుకుమార్ (Sukumar) శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన సినిమా ప్రమోషన్స్ కు సుకుమార్ వస్తున్నారు. అయినా సరే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే జస్ట్ ఓకే అనిపించుకోగా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింతగా డ్రాప్ అయింది. 

ఆల్ మోస్ట్ 70% కి పైగా డ్రాప్స్ ను 4వ రోజు నుంటి మొదలైన ఈ సినిమా ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లోనే.. షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా మిగిలిన చోట్ల మరో 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఓన్ రిలీజ్ అయినా కూడా సినిమా కి వచ్చిన టాక్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువే కావటంతో రికవరీ అవుతుందని భావించారు.

  ‘ప్రసన్నవదనం’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.25 కోట్ల షేర్ 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.. అయితే  సినిమా 4 వ రోజు నుంచి భారీగా డ్రాప్ అవుతూండటంతో కష్టమే అనిపిస్తోంది. ఇక మిగిలిన ఫుల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

సుహాస్, పాయల్ రాధకృష్ణ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రమే ‘ప్రసన్నవదనం’. ఈ మూవీలో హీరో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే ఒక వింత వ్యాధితో బాధపడుతుంటాడు. తను మొహాలను గుర్తుపట్టలేడు. అలాంటి హీరో జీవితంలోకి హీరోయిన్ ఎలా వస్తుంది, ఒక మర్డర్‌ను కళ్లారా చూసిన తర్వాత తన జీవితం ఎలా మారుతుంది అనేది కథ. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా తెరకెక్కలేదు.  ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) , రాశి సింగ్ హీరోయిన్స్. మే 3న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 

click me!