నాకు ఎదురొస్తావా.. అనిల్ రావిపూడికి రామ్ చరణ్ వార్నింగ్! మెగా హీరో ఆగ్రహానికి కారణం?

First Published May 8, 2024, 9:03 AM IST

దర్శకుడు అనిల్ రావిపూడికి హీరో రామ్ చరణ్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. అందుకు కారణం ఏమిటో కూడా ఆయన చెప్పుకొచ్చారు. 
 

అనిల్ రావిపూడి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. పటాస్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాల సక్సెస్ ఆయన్ని స్టార్ చేశాయి. అనిల్ రావిపూడి గత చిత్రం భగవంత్ కేసరి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. తన గత చిత్రాలకు భిన్నంగా భగవంత్ కేసరి తెరకెక్కించాడు. 
 

నెక్స్ట్ అనిల్ రావిపూడి హీరో వెంకటేష్ తో చిత్రం చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్-అనిల్ రావిపూడిది హిట్ కాంబినేషన్. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ కొట్టింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 పర్వాలేదు అనిపించుకుంది. చిరంజీవితో పాటు పలువురు స్టార్స్ అనిల్ రావిపూడితో మూవీ చేయాలని ఆశపడుతున్నారు. 
 

Ram Charan

కాగా అనిల్ రావిపూడికి రామ్ చరణ్ వార్నింగ్ ఇచ్చాడట. నాకు పోటీగా వస్తావా.. అని ముఖాన అడిగేశాడట. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. 2019 సంక్రాంతి బరిలో నిలిచాయి వినయ విధేయ రామ, ఎఫ్ 2, ఎన్టీఆర్ కథానాయకుడు. 
 

రామ్ చరణ్ - తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా 'వినయ విధేయ రామ' సినిమా వలన దారుణమైన ట్రోలింగ్ కి గురయ్యాడు చరణ్. సినిమాలో ఫైట్స్, ట్రైన్ సీన్, గద్ద సీన్ ఇలా ప్రతీ విషయాన్ని ట్రోల్ చేశారు.

అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు త్రిపుల్ డిజాస్టర్. ఆ సినిమాను పట్టించుకున్న నాథుడు లేడు. దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ సైతం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 భారీ వసూళ్లు రాబట్టింది. 

Ram Charan


రామ్ చరణ్, బాలయ్యలకు ఝలక్ ఇస్తూ వెంకటేష్-వరుణ్ తేజ్ సంక్రాంతి విన్నర్స్ అయ్యారు. కాగా ఈ మూవీ విడుదలకు ముందు ఓ సందర్భంలో అనిల్ రావిపూడి-రామ్ చరణ్ కలిశారట. ఏంటి నా సినిమాకు పోటీగా నీ సినిమా విడుదల చేస్తావా? అని రామ్ చరణ్ అనిల్ రావిపూడికి వార్నింగ్ ఇచ్చాడట. 


అనిల్ రావిపూడి షాక్ అయ్యాడట. షాక్ లో నుండి తేరుకునే లోపు... గట్టిగా హత్తుకుని జస్ట్ జోకింగ్. నీ మూవీ బాగా ఆడాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అని చరణ్ అన్నాడట. దాంతో అనిల్ రావిపూడి ఊపిరి పీల్చుకున్నాడట. అదన్నమాట మేటర్. 

click me!