చలికాలంలో మీ కాళ్లు, చేతులు చల్లగా అయిపోతున్నాయా? అయితే ఇలా చేయండి

First Published Jan 16, 2023, 1:59 PM IST

చల్లని గాలుల వల్ల జలుబు, దగ్గు, జ్వరంతో పాటుగా ఎన్నో రకాల రోగాలు కూడా వస్తుంటాయి. చల్లని గాలులకు ముందుగా మన శరీరంలోని చేతులు, కాళ్లే ముందుగా చల్లగా అవుతుంటాయి. 
 

 చలికాలంలో ఎక్కువగా పాదాలపై ప్రభావం పడుతుంది. చెప్పులు ఉంటే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చలికాలంలో చేతులు మంచులా చల్లగా ఉండే వారు కూడా చాలా మందే ఉన్నారు. గంటల తరబడి మంట ముందు కూర్చున్నా చేతులు వేడిగా కావు. అయితే కొన్ని సులువైన చిట్కాలతో కాళ్లను, చేతులను వెచ్చగా ఉంచుకోవచ్చు. 
 

ఎండాకాలం అయినా, శీతాకాలమైనా చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండే  చాలా మందిని మీరు చూసే ఉంటారు. ఇలా ఎందుకంటే జరుగుతుందంటే ఆక్సిజన్ తగినంతగా చేతులు, కాళ్లకు చేరదు. దీనివల్ల రక్త ప్రసరణ దెబ్బతిని చేతులు, కాళ్లు చల్లబడటం మొదలవుతుంది.
 

చలికాలంలో చేతులు, కాళ్ళను వెచ్చగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రదేశాల నుంచి చలి మొదట శరీరంలోకి ప్రవేశిస్తుంది. చలి మరీ ఎక్కువైతే జలుబు, చలిజ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సహజంగా మీ చేతులు, కాళ్ళను వెచ్చగా ఉంచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చలికాలంలో చేతులు, కాళ్లు వెచ్చగా ఉండటానికి,  రక్తప్రసరణ మెరుగుపడటానికి రోజూ వేడి నూనెతో కాళ్లు, చేతులను మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్ళకు తగినంత మొత్తంలో ఆక్సిజన్ ను అందిస్తుంది.

శీతాకాలంలో వీలైనంత ఎక్కువ సేపు సాక్స్, గ్లౌజులు ధరించడానికి ప్రయత్నించండి. అయితే మరీ టైట్ సాక్స్ లు, గ్లౌజులు వేసుకుని పడుకోకూడదు. రాత్రిపూట వీటిని తీసేసి పడుకోవడమే మంచిది. 

శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఆహారం కూడా చాలా సహాయపడుతుంది. చల్లని చేతులు,  పాదాలను వేడి చేయడానికి మీరు ఇనుము ఎక్కువగా ఉండే వస్తువులను తినండి.

యోగా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది ప్రతి అవయవానికి తగినంత ఆక్సిజన్ ఇస్తుంది. తగినంత ఆక్సిజన్ మీ శరీరానికి చేరడం వల్ల మీ చేతులు, కాళ్ళు కూడా వెచ్చగా ఉండటం ప్రారంభిస్తాయి.

click me!