ప్రభాస్‌కిది పెద్ద అవమానం.. బాలయ్య, నాగ్‌, మహేష్‌, రామ్‌ల కంటే వెనకబడిపోయాడే.. `సలార్‌` ఎంత పని చేసింది!

Published : May 03, 2024, 03:52 PM ISTUpdated : May 03, 2024, 04:28 PM IST

ప్రభాస్‌ థియేటర్లలో దుమ్మురేపాడు. కానీ బుల్లితెరపై మాత్రం డీలా పడ్డాడు. బాలయ్య, నాగ్‌, మహేష్‌ కంటే వెనకబడిపోవడం గమనార్హం. ఇది డార్లింగ్‌ ఫ్యాన్స్ కి షాకిస్తుంది.   

PREV
18
ప్రభాస్‌కిది పెద్ద అవమానం..  బాలయ్య, నాగ్‌, మహేష్‌, రామ్‌ల కంటే వెనకబడిపోయాడే.. `సలార్‌` ఎంత పని చేసింది!

ప్రభాస్‌ చాలా రోజుల తర్వాత హిట్‌ కొట్టాడు. `బాహుబలి` తర్వాత ఆయనకు హిట్‌ రాలేదు. `సలార్‌`తో తానేంటో చూపించాడు. ఈ సినిమా నార్త్ లో `డుంకి` దెబ్బ పడిందిగానీ లేదంటే ఈజీగా మరో రెండు వందల కోట్ల కలెక్షన్లు వచ్చేవి. థియేటర్లతో గతేడాది టాలీవుడ్‌కి బిగ్‌ రిలీఫ్‌ నిచ్చింది. ఊపిరి పీల్చుకునేలా చేసింది.
 

28

థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ఓటీటీలోనూ సత్తా చాటింది. డిజిటల్‌ మాధ్యమంలోనూ మంచి వ్యూస్‌ సాధించింది. కానీ టీవీలో మాత్రం డీలా పడిపోయింది. దారుణమైన రేటింగ్‌ నమోదైంది. ప్రభాస్‌ కిది అవమానమే అనేంతగా తక్కువ రేటింగ్‌ రావడం గమనార్హం. ఇదే ఇప్పుడు షాకిస్తుంది. రెండు వారాల క్రితం `సలార్‌` స్టార్‌ మాలో ప్రసారమైన విషయం తెలిసిందే. 

38

ఈ మూవీకి టీవీలో అతి తక్కువగా 6.5 టీఆర్‌పీ రేటింగ్‌ రావడం ఆశ్చర్యపరుస్తుంది. థియేటర్లలో, ఓటీటీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు, వ్యూస్‌ రాగా, టీవీ ఆడియెన్స్ ని మాత్రం ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ రేటింగ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌ చిత్రాల్లో తక్కువ రేటింగ్‌ సాధించిన చిత్రంగా నిలిచిందంటున్నారు. 
 

48

ఇదిలా ఉంటే ప్రభాస్‌.. బాలయ్య, మహేష్‌ బాబు, నాగార్జున, రామ్‌, పాయల్‌ చిత్రాల కంటే తక్కువ రేటిగ్‌ నమోదు కావడం గమనార్హం. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బాలయ్య టాప్‌లో ఉన్నారు. ఆయన నటించిన `భగవంత్‌ కేసరి` మూవీ ఏకంగా 9.36 టీఆర్‌పీ రేటింగ్‌తో టాప్‌లో ఉంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కాజల్‌ హీరోయిన్‌గా నటించగా, శ్రీలీల కీలక పాత్రలో నటించిన విషయం తెలిసింది. 
 

58
Gunturkaaram

ఆ తర్వాత మహేష్‌ బాబు సినిమా `గుంటూరు కారం` నిలిచింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన `గుంటూరు కారం` చిత్రం ఈ సంక్రాంతికి  థియేటర్లలోకి వచ్చి భారీగా నెగటివ్‌ టాక్‌ని ఫేస్‌ చేసింది. అయినా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓటీటీలో దుమ్మురేపింది. ఇక టీవీలోనూ మంచి రేటింగ్‌ సాధించింది. దీనికి 9.23 యావరేజ్‌ టీఆర్‌పీ రేటింగ్‌ సాధించడం విశేషం. 

68

అదే సంక్రాంతికి నాగార్జున నటించిన `నా సామి రంగ` కూడా థియేటర్‌లోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత నాగ్‌కి కూడా హిట్‌ పడింది. ఇక ఈ మూవీ టీవీలో 8.15 రేటింగ్‌ సాధించడం విశేషం. బాలయ్యతో పోల్చితే తక్కువే అయినా నాగార్జునకిది మంచి టీఆర్‌పీ రేటింగ్‌ అనే చెప్పాలి. ఇందులో నాగ్‌తోపాటు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ నటింగా విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించారు.

78

మరోవైపు ఇటీవల వచ్చిన వాటిలో రామ్‌ `స్కంద` థియేటర్లలో పరాజయం చెందింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో, ఓటీటీలో పెద్దగా ఆడలేదు. కానీ టీవీలో మంచి రేటింగ్‌ వచ్చింది. దీనికి `8.5 రేటిగ్‌ రావడం విశేషం. అలాగే పాయల్‌ రాజ్‌పుత్‌ నటించిన `మంగళవారం` చిత్రానికి కూడా మంచి రేటింగ్‌ వచ్చింది. దీనికి 8.3 టీఆర్‌పీ రేటింగ్‌ రావడం గొప్ప విషయమే. ఈ సినిమాల స్థాయిలోనూ `సలార్‌` సత్తా చాటలేకపోవడం విచారకరం. 

88

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన `సలార్‌`లో ప్రభాస్‌తోపాటు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలో నటించారు. ఇద్దరు స్నేహితులుగా కనిపించారు. స్నేహితులు విలన్లుగా ఎలా మారారనేది రెండో పార్ట్ లో ఉండబోతుంది. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా కనిపించింది. ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, ఝాన్సీ, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో మెరిశారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories