Latest Videos

పాత స్కూల్, కాలేజీ బ్యాగులతో ఏమేమి చేయొచ్చో తెలుసా?

First Published May 24, 2024, 3:18 PM IST

స్కూల్ స్టార్ట్ కాగానే స్కూల్, కాలేజీ పిల్లలు పాత బ్యాగులను పక్కన పడేసి కొత్తవాటిని కొంటుంటారు. ఇక ఈ పాత బ్యాగులు దేనికీ పనికి రావని చాలా మంది వాటిని పారేస్తుంటారు. కానీ ఈ పాత బ్యాగులు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఎలాగంటే? 
 


ఆడవారికి వేటినీ అంత తొందరగా పారేసే అలవాటు అస్సలు ఉండదు. ఎంత పాతవస్తువైనా ఏదో ఒకదానికి ఉపయోగపడుతుందని అలాగే దాచిపెడుతుంటారు. ఇలాంటి వాటిలో పాత బ్యాగులు ఒకటి. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రతి క్లాసుకు కొత్త బ్యాగులను వాడుతుంటారు. పాత బ్యాగులు అలాగే మిగిలిపోతాయి. వీటితో ఏం చేయాలో తెలియక ఓ సంచిలో కట్టేసి ఏదో ఒక చోట పెడుతుంటారు. కానీ ఈ పాత బ్యాగులను కూడా మీరు ఎన్నో పనుల కోసం ఉపయోగించొచ్చు. అవును పాత బ్యాగులను పారేయడానికి లేదా దాచిపెట్టడానికి బదులుగా వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఫస్ట్ ఎయిడ్ కిట్ గా..

ప్రతి ఒక్కరి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకు అత్యవసరం కూడా. అయితే మనలో చాలా చాలా మంది ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం ప్లాస్టిక్ లేదా స్టీట్ బాక్స్ లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ గా మీరు పాత స్కూల్, కాలేజీ బ్యాగులను కూడా ఉపయోగించొచ్చు. వీటిని మీరు ఎటు వెళ్లినా సులువుగా క్యారీ చేయొచ్చు. 
 

hammer

 గృహోపకరణాల కోసం..

మన ఇంట్లో సుత్తిలు, పానలు వంటి  గృహోపకరణాలను ఎక్కువగా డ్రాయర్లోనే పెడుతుంటారు చాలా మంది. కానీ వీటిని డ్రాయర్లో కాకుండా మీరు పాత బ్యాగుల్లో పెట్టొచ్చు. ఈ వస్తువులను ఉంచడానికి బ్యాగులు బాగుంటాయి. అలాగే ఈ బ్యాగులను ఇంట్లో ఏ మూలనైనా పెట్టుకోవచ్చు.

ల్యాప్ టాప్ కోసం.. 

చాలా మంది ల్యాప్ టాప్ కోసం ప్రత్యేకంగా బ్యాగ్ లను కొంటుంటారు. కానీ దీన్ని పెట్టడానికి పాత బ్యాగ్ ను కూడా ఉపయోగించొచ్చు. మీ ల్యాప్ టాప్ బ్యాగ్ పాడైపోతే.. కొత్తది కొనాలని చూస్తున్నట్టైతే ఈ పాత స్కూల్ లేదా కాలేజీ బ్యాగులను వాడండి. 
 

డాక్యుమెంట్ల కోసం..

 ప్రతి ఒక్కరికీ డాక్కుమెంట్లు ఉంటాయి. ఇవి చాలా సేఫ్ గా ఉంటాయి. మీరు మీ డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం పాత బ్యాగులను ఉపయోగించండి. వాటిని ఎక్కడ పెడితే సురక్షితంగా ఉంటాయో అక్కడే పెట్టండి. 

బొమ్మల కోసం.. 

మీ ఇంట్లో చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఈ పాత బ్యాగులు మీకు బాగా ఉపయోగపడతాయి. పిల్లలు ఆడుకోవడం వల్ల అవి ఎక్కడపడితే అక్కడ చెల్లాచెదురుగా ఉంటాయి. వీటిని ఉంచడానికి ఏమీ లేకపోతే పాత బ్యాగులో వేయండి. 

click me!