ఫోన్ ఎక్కువ సేపు చూడకూడదంటే ఏం చేయాలో తెలుసా?

First Published | May 17, 2024, 2:29 PM IST

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లను వాడుతున్నారు. వీరిని అలాగే విడిచిపెడితే పొద్దంతా ఫోన్లూ చూస్తూనే ఉంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఫోన్లు, ట్యాబ్, ల్యాప్ టాప్ అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి చూసే అలవాటు ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. మరి స్క్రీన్ టైంను తగ్గించడానికి ఏం చేయాలంటే? 
 

phone

ప్రస్తుత కాలంలో ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఫోన్లు కాకపోతే టీవీ ఇది కాకపోతే ట్యాబ్, ల్యాప్ టాప్ అంటూ ఏదో  ఒకదానిని చూస్తేనే ఉంటారు చాలా మంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువ సేపు చూడటం వల్ల తలనొపపి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

టైం కేటాయించండి

సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ ను ఎంత సేపు చూడాలో దానికి సమయం కేటాయించండి. దీని ప్రకారం.. మీరు మీ స్క్రీన్ సమయాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఫోన్ చూస్తుంటే ఎంత టైం అయ్యిందో తెలియదనుకుంటే ఈ పద్దతిని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫోన్ లో రిమైండర్ పెట్టండి.

Latest Videos


బ్రేక్ టైమ్ లో ఫోన్ ఉపయోగించొద్దు

చాలా మంది లంచ్ బ్రేక్ లో కూడా ఫోన్లను చూస్తూనే ఉంటారు. కానీ ఈ అలవాటును మానుకోండి.లంచ్ బ్రేక్ ఉంటే ఆ సమయంలో ఫోన్  అస్సలు ముట్టుకోకండి. చాలా మంది గంట బ్రేక్ లో భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్ ను వాడుతూనే ఉంటారు. దీనివల్ల వారికి తెలియకుండానే ఫోన్ యూజ్ చేసే టైం పెరుగుతుంది. అందుకే బ్రేక్ సమయంలో ఫోన్ చూడకుండా ఫ్రెండ్స్ తో గడపండి. 
 

రాత్రిపూట ఫోన్ వాడకూడదు

రాత్రిపూట ఫోన్ చూసే అలవాటు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో ఎంతసేపు ఫోన్ చూస్తున్నారో తెలియకుండా అందులో మునిగిపోతారు. అందుకే అందుకే రాత్రి పడుకునేటప్పుడు మీ ఫోన్ ను టేబుల్ పై ఉంచండి. ముఖ్యంగా ఫోన్ మీ చేతికి అందకుండా పెట్టాలి. చాలా మందికి రాత్రంతా ఫోన్ వాడటం వల్ల కంటి నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.

click me!