మీ కళ్లు బాగా కనిపించాలంటే ఇలా చేయండి..

First Published Dec 8, 2022, 11:52 AM IST

ఈ ప్రపంచాన్ని చూడటానికి కళ్లు చాలా అవసరం. కళ్లు లేకుండా మన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

eye health

మన కన్ను కెమెరా కంటే పవర్ ఫుల్. ఈ ప్రపంచాన్ని చూడటానికి కళ్లు చాలా అవసరం. మన శరీరంలో కళ్లు అతి ముఖ్యమైన, సున్నితమైన భాగం. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, వయస్సుతో కంటి సమస్యలు వస్తుంటాయి. మాక్యులర్ క్షీణత, కంటిశుక్లం, డయాబెటీస్ రెటినోపతి, గ్లాకోబి, డ్రై ఐ, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలను చాలా మంది ఫేస్ చేస్తుంటారు. కంటి చూపు బాగుండాలంటే కొన్ని పనులను తప్పకుండా చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

20-20-20 నియమం

ఈ రోజుల్లో స్క్రీన్ ను చూసే వారు ఎక్కువయ్యారు. ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు, టెలివిజన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ లకే అత్తుక్కుపోతోంది నేటి తరం యువత. నిజానికి ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. అయినప్పటికీ కంటి వైద్యులు 20-20-20 నిబంధనను ఫాలో అవ్వమని సలహానిస్తున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలు స్క్రీన్ ను చూసిన తర్వాత.. మీ నుంచి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో వైపు లేదా వస్తువు వైపు 20 సెకన్ల పాటు చూడాలన్నమాట. కిటికీలోంచి దూరంగా కనిపించే చెట్టు వంటి వాటిని ఎక్కువగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. 
 

బ్లూ కట్ లెన్సులు, సన్ గ్లాసెస్

డిజిటల్ పరికరాలపై ఎక్కువ గంటలు గడుపుతున్నట్టైతే మీరు ఖచ్చితంగా బ్లూ లైట్ బ్లాకర్ లెన్సెస్ లేదా బ్లూ కట్ లెన్సెస్ ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి హానికరమైన హై ఎనర్జీ బ్లూ లైట్, యువి కిరణాలను కళ్ళలోకి రాకుండా నిరోధించే ప్రత్యేక పూతను కలిగి ఉంటాయి. అలాగే ఫ్యాషన్ యాక్సెసరీగా పరిగణించే సన్ గ్లాసెస్.. సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి మీ కళ్ళను రక్షిస్తాయి. సన్ గ్లాసెస్ కొనేటప్పుడు 99 నుంచి 100 శాతం యువి-ఎ, యువి-బి ఎక్స్పోజర్ ను నివారించే వాటినే కొనండి. 
 

బాగా తినండి

క్యారెట్లు కంటిచూపుకు చాలా మందివని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఏదేమైనా కంటి చూపు బాగుండటానికి పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బచ్చలికూర, కాలే లేదా కొల్లార్డ్ ఆకుకూరలు వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలు కూడా కంటి చూపును కాపాడుతాయి. అలాగే సాల్మన్, లేక్ ట్రౌట్, మాకేరెల్, సార్డినెస్, ట్యూనా, హాలిబట్ వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న చేపలను తింటే కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

వ్యాయామం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మాక్యులర్ క్షీణత అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉంది. అలాగే వ్యాయామం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఏరోబిక్ వ్యాయామం మంచి అభిజ్ఞా పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని కనుగొనబడింది.  అందుకే ఆరోగ్యకరమైన కళ్ల కోసం మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయండి.

eyes

కోల్డ్ కంప్రెస్

కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రతిరోజూ మీ కళ్లు తాజాగా కనిపించడానికి అద్భుతమైన సహజ పరిష్కారం కోల్డ్ కంప్రెస్. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా శీతాకాలంలో ఇది ఎంతో ఉపయోపడుతుంది. రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన కంప్రెస్డ్ మాస్క్ ఉపయోగించడం వల్ల అలసట తగ్గుతుంది. పొడి కళ్ళు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. 

click me!