ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితుల్లో ఒకరు. చాణక్యుడు తన చాణక్య నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలను చెప్పారు. వాటిలో ఒక వ్యక్తి ఎక్కువ రోజులు, ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలో కూడా ఉంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో కొంతమంది వ్యక్తుల గురించి చెప్పారు. ఇలాంటి వారే ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో జీవిస్తారు. అందుకే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఒక వ్యక్తి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Chanakya Niti
ఇలా తినండి
తక్కువగా తినే వ్యక్తులే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని ఆచార్య చాణక్యుడు చెప్తాడు. ఇలాంటి వారే దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆచార్య చాణక్యుడు నమ్ముతారు. అందుకే ఒక వ్యక్తి తన ఆకలి కంటే కొంచెం తక్కువగానే తినాలి. ఇలా తిన్నవారు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారని చాణక్య నీతి చెప్తోంది.
Chanakya Niti
ఇలాంటి వారు ఆరోగ్యంగా ఉంటారు
ఎప్పుడూ అతిగా తినే వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడతారని ఆచార్య చాణక్యుడు చెప్తాడు. ఎందుకంటే శరీర సామర్థ్యానికి మించి తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే మొదటి భోజనం జీర్ణమైన తర్వాత మాత్రమే ఆహారాన్ని తిరిగి తినాలని చాణక్య నీతి చెప్తోంది. ఇది మన జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచుతుంది. అలాగే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ
నేటి గజిబిజీ జీవితంలో తమకోసం వెచ్చించే సమయం దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి తన కోసం కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే పనితో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతారు.