టీ తో నెలసరి నొప్పికి చెక్ పెట్టొచ్చా..?

First Published Jan 17, 2022, 10:53 AM IST

నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ కాదు. కడుపు నొప్పి, వాంతులు, తిమ్మిర్లు, తల తిరగడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ చిట్కాలను పాటిస్తే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు..

ప్రతినెలా నెలసరి రావడం సర్వ సాధారణమైన విషయం. అయితే కొందరు పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికారు. కానీ చాలా మంది ఈ నెలసరి సమయంలో కడుపు నొప్పిసమస్యతో తీవ్రంగా విలవిలాడుతుంటారు. ఆ నొప్పిని మాటల్లో వర్ణించడం కష్టమేమో.  ఎందుకంటే ఎదుటివాళ్లకు కూడా తమ బాధను చెప్పలేనంతగా కడుపు నొప్పి వేధిస్తుంది. అందులోనూ వికారం, bloting వంటి సమస్యలతో వారు సతమతమవుతుంటారు. ఈ సమస్యతో మహిళలు కుదురుగా ఉండలేరు. కాగా నెలసరి సమయంలో అందరిలో ఈ సమస్యలే రావు. మనిషిని బట్టి సమస్యలు మారుతూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కడుపునొప్పితో పాటుగా, డయేరియా, తలనొప్పి వంటివి కూడా అటాక్ చేస్తుంటాయి. 
 

సమస్యలు ఎలాంటివైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నిపుణులు వెళ్లడించిన ఈ చిట్కాలను పాటిస్తే ఈ నెలసరి నొప్పి నుంచి ఈజీగా బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తే Painkillers tablet ను మాత్రం అస్సలు వాడకూడదని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. అందులోనూ ఇవి వాడటం వల్ల Side effects వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ ట్యాబ్లెట్స్ కు బదులుగా ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

టీ.. నేడు ప్రతి ఒక్కరూ టీ తాగుతున్నారు. చిన్నలు పెద్దలు అంటూ తేడా లేకుండా టీకి బాగా అలవాటు పడిపోయారు. కాగా వేడి వేడి టీ తో పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పికి చెక్ పెట్టొచ్చు. పీరియడ్స్ లో క్రామ్ప్స్ వల్ల నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి నుంచి మీకు నచ్చిన టీ తో ఉపశమనం పొందవచ్చు. వేడి వేడిగా ఒక కప్పు టీని తాగితే కడుపు నొప్పి నుంచి వెంటనే కాస్త రిలీఫ్ ను పొందవచ్చు. 

హాట్ వాటర్ బాటిల్.. చాలా మంది మహిళలు ఈ చిట్కాను ఫాలో అవుతూ కడుపు నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందుతున్నారు. ఏ ప్లేస్ లో అయితే కడుపు నొప్పిగా ఉంటుందో అక్కడ.. నీళ్లను వేడి చేసి ఒక బాటిలో పోసి కడుపుపై పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి తొందరగా రిలీఫ్ పొందవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల చాలా వరకు నొప్పిని కంట్రోల్ చేయవచ్చని ఎంతో మంది మహిళలు పేర్కొంటున్నారు. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో మీరు కూడా ఈ పద్దతిని అనుసరించడం ఉత్తమం.
 

నీళ్లను ఎక్కువుగా తాగాలి.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకు సుమారుగా 10 గ్లాసుల నీళ్లను తాగాలి. ఇకపోతే నెలసరి సమయంలో చాలా మంది నీళ్లకు దూరంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో నీళ్లను ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఆ సమయంలో నీళ్లను ఎక్కువగా తాగితే బ్లోటింగ్ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఆ టైం లో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే నీళ్లను తప్పని సరిగా ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే అల్లం టీ తాగితే ఈ నొప్పి నుంచి చాలా ఫాస్ట్ గా ఉపశమనం పొందవచ్చు. వాము కూడా దీనికి చక్కటి చిట్కాలా ఉపయోగపడుతుంది. 
 

click me!