ఇక్కడ కార్స్ అస్సలు లాక్ చేయరు.. ఎందుకో అసలు కారణం తెలిస్తే షాకవుతారు !

By Ashok kumar SandraFirst Published May 1, 2024, 7:27 PM IST
Highlights

పార్కింగ్ ప్లేస్‌లో కారు పార్క్ చేసినప్పుడు లాక్ చేయకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయము. అయితే ఈ నగర ప్రజలకు కారుకు ఎలా తాళం వేయాలో తెలియడం లేదు. అవును మీరు విన్నది నిజమే.. కానీ వారు కారు అన్‌లాక్ చేయకుండా వదిలేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. 
 

కారు పార్క్ చేసి లాక్ వేసి నాలుగుసార్లు చెక్ చేసినా.. కొన్ని చోట్ల అద్దాలు పగులగొట్టి అందులోని వస్తువులను దొంగిలిస్తుంటారు. మరికొందరు ఇంకొంచెం తెలివిగా కారునే దోచుకుంటుంటారు. కారు తాళం వేయకపోతే కథ ముగిసినట్లే... నాలుగడుగులు ముందుకు వేసి వెనక్కి చూస్తే కారు మాయమైపోతుంది. కానీ కెనడియన్ పట్టణంలో కారు ఎక్కడ ఉన్నా దాని డోర్స్  ఎప్పుడూ లాక్ చేయరు. లాక్  వేయకుండా వెళ్లిపోయినా కారును ఎవరూ తీసుకెళ్లరు. దీని వెనుక ఎలాంటి ఆచారం లేదా సంప్రదాయం లేదు కానీ మానవత్వం దాగి ఉంది. కారు దొంగిలించని నగరంలో ఇలా  ఎందుకు చేస్తారో చూద్దాం..

 కెనడాలో చర్చిల్ అనే చిన్న నగరం ఉంది. ఈ నగరం హడ్సన్ బే  పశ్చిమ చివరలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు వారి కార్లను పార్కింగ్ ప్లేస్‌తో సహా రోడ్డు పక్కన ఎక్కడ పార్క్ చేసినా వాటిని అన్‌లాక్ చేసే ఉంచుతారు. 

Latest Videos

అక్కడి ప్రజలు ఇలా చేయడానికి కారణం తెల్ల ఎలుగుబంటి(polar bear). చర్చిల్ (Churchill) ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అందుకే చర్చిల్‌ను polar bear రాజధాని అని పిలుస్తారు. ప్రపంచంలోని 60 శాతం తెల్ల ఎలుగుబంట్లు కెనడాలోనే ఉన్నాయి. ఈ  ఎలుగుబంట్లు చాలా అందంగా ఉంటాయి. ఏమీ చేయవని వాటి దగ్గరకు వెళితే ఇక మీ కథ అయిపోయినట్లే. ఎందుకంటే ఈ ఎలుగుబంట్లు చాలా ప్రమాదకరమైనది. ఇవి తరచుగా మనుషులపై దాడి చేస్తాయి. ఈ ఎలుగుబంట్లు సైబీరియన్ పులి కంటే పెద్దది. వీటిని అత్యంత ప్రమాదకరమైన మాంసాహార జివిగా పరిగణిస్తారు. వాటి ముందు మనం గొడవ చేయకుండా నిదానంగా ప్రాణం కాపాడుకోవాలి. ఈ  ఎలుగుబంట్లు చర్చిల్‌లో ఎక్కువగా ఉన్నందున వాటి నుండి తప్పించుకోవడం కష్టం. ఎవరినైనా ఈ  ఎలుగుబంటి వెంబడిస్తే వారు కారులో కూర్చుని తమను తాము రక్షించుకోవచ్చు కాబట్టి ప్రజలు అక్కడ కారుకు తాళం వేయకుండా వెళతారు. చర్చిల్‌లో దీనికి సంబంధించి ఎటువంటి నియమం లేదు. కానీ మనుషులు మానవత్వంతో ఈ పని చేస్తుంటారు.

 ఎలుగుబంటి ప్రత్యేకత: కెనడా, అలాస్కా, గ్రీన్‌లాండ్, రష్యా ఇంకా  నార్వేలోని ఆర్కిటిక్‌లో  గడ్డకట్టిన అడవులలో ఈ  ఎలుగుబంట్లు కనిపిస్తాయి. పెద్ద ఎలుగుబంట్లు 2.5 మీటర్ల పొడవు, 680 కిలోగ్రాముల బరువు ఉంటాయి. వారి పెద్ద  ఆకారం, బరువు వాటిని భూమిపై అతిపెద్ద జీవ మాంసాహారంగా చేస్తాయి. ఈ   ఎలుగుబంట్లు అద్భుతమైన ఈదగల జివి, ఇవి 16 కి.మీ దూరం వరకు ఎర వాసన చూడగలవు. ఆడ  ఎలుగుబంట్లు నవంబర్ లేదా డిసెంబర్‌లో మంచు గుహలలో పిల్లలకు జన్మనిస్తాయి. పిల్లలు పుట్టినప్పుడు కేవలం 30 సెం.మీ ఉంటాయి. వాతావరణ మార్పు ఈ  ఎలుగుబంట్లకు శత్రువు. అనేక ఎలుగుబంట్లు ఆహారం దొరకక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. ఈ కారణంగా, చర్చిల్లో ఎలుగుబంట్లు పెరుగుతున్నాయి. 

click me!