ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే మీరు, మీ జుట్టు, మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి..

First Published Aug 28, 2022, 11:08 AM IST

ఎంత పౌష్టికాహారం తీసుకున్నా.. కొన్ని అలవాట్ల వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే  ఉదయం పూట మీరు కొన్ని అలవాట్లను చేసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ, జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

నోటి దుర్వాసన మీ లైఫ్ స్టైల్ ను దెబ్బతీస్తుంది. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కారణమేదైనా.. బ్యాడ్ స్మెల్ వల్ల నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.  అయితే కొన్ని ఆహారపు అలవాట్లతో పాటుగా మీ దినచర్యలో మార్పులు చేసుకుంటే నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. అలవాట్ల వల్ల జుట్టు, చర్మం, జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం మన దినచర్యలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

వెదురు బ్రష్ ను ఉపయోగించండి

నోటి ఆరోగ్యం బాగుంటేనే మీ శరీరం పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు మనం రోజూ తోముకునే బ్రష్ తో కాకుండా వెదురు లేదా వేప మొదలైన ప్రయోజనకరమైన కలపతో తయారుచేసిన బ్రష్ ను వాడండి. ఈ బ్రష్ లో సహజ లక్షణాలుంటాయి. ఇది నోటిలో ఉండే తొలగిస్తుంది. అలాగే చిగుళ్లను బలంగా తయారుచేస్తుంది. ఈ బ్రష్ లు పూర్తిగా బయో డిగ్రేడబుల్.  ఇలాంటి బ్రష్ లను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.
 

ఆయిల్ పుల్లింగ్

ఆయిల్ పుల్లింగ్ చేయడం ఎంతో మంచిది. దీనివల్ల నోట్లో ఉండే క్రిమికీటకాలు, బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. చాలా మంది కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తారు. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే మంచి  ప్రయోజనం ఉంటుంది. 
 

నాలుకను శుభ్రపరచండి

ఉదయం లేవగానే ముఖాన్ని కడగడం ఎంత ముఖ్యమో.. నాలుకను, దంతాలను క్లీన్ చేసుకోవడం అంతే ముఖ్యం. మనం నైట్ తిన్న ఆహారాల వల్ల నోటిలో దుర్వాసన రావడంతో పాటుగా రకరకాల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మనం రోజంతా తిన్న ఆహారం, రకరకాల రుచులు, దుమ్ము, దూళి, మృతకణాలు, బ్యాక్టీరియా వంటివి నాలుకపై పేరుకుపోతాయి. ఇవే బ్యాడ్ స్మెల్ కు కారణం. నోటి ఆరోగ్యం బాగాలేకపోతే మీ మొత్తం శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. చిగుళ్ల వ్యాధి రావడానికి కారణం కూడా ఈ బ్యాక్టీరియా, మృతకణాలే కారణం. అందుకే నాలుకను నోటిని క్లీన్ గా ఉంచండి. ఇది జీర్ణక్రియకును ఆరోగ్యంగా ఉంచుతుంది. 


నీళ్లను పుష్కలంగా తాగండి

నీరు ఎన్నో రోగాలను నయం చేయడంలో ముందుంటుంది. అందుకే నీటిని పుష్కలంగా తాగండి. నీటిని ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మీరు తినే ఆహారంలోని పోషకాలు శరీరంలోని వివిధ భాగాలు చేరాలంటే తప్పని సరిగా నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల మీరు రీఫ్రెష్ గా ఉంటారు. రోజంతా శక్తివంతంగా పనిచేస్తారు.  రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. నీటిని తాగితే నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోదు.  
 

click me!