భారతీయ వంటకాల్లో లవంగాలు సాధారణంగా ఉపయోగించే మసాలా. లవంగాలను అనేక ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. లవంగం చాలా ఆరోగ్యకరమైన మసాలా. ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తారు. దాని ప్రత్యేకమైన రుచి, వాసన కారణంగా, లవంగాలను అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు.
నేషనల్ న్యూట్రియంట్ డేటాబేస్ ప్రకారం, లవంగాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ , డైటరీ ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, ఇది దంతాలు, చిగుళ్ల సమస్యలను నయం చేస్తుంది. అంతే కాదు లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులు , ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం మొదలైన వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
లవంగాలలో పోషకాలు:
లవంగాలలో ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, విటమిన్లు, జింక్, కాపర్, సెలీనియం, థయామిన్, సోడియం, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, ఇది యాంటీమైక్రోబయల్ , యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అలాగే, లవంగాలు తినడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?
బరువు తగ్గడానికి లవంగాలు ఎలా తినాలి?
బరువు తగ్గాలనుకునే వారు లవంగాలను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా 3 లేదా 4 లవంగాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. దీన్ని రోజూ తాగితే ఇందులోని పోషకాలు శరీరంలో మెటబాలిజంను పెంచి శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన చెడు కొవ్వును కరిగిస్తాయి.
cloves
అలాగే, లవంగాలను పొడి రూపంలో మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీర బరువు కూడా కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగే బదులు లవంగాలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి ప్రతిరోజూ తాగితే శరీర బరువు అదుపులో ఉంటుంది.
cloves 07
కాబట్టి బరువు తగ్గాలనే తొందరలో లవంగాలను ఎక్కువగా తినకండి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులోని రసాయనాలు ప్రేగు పనితీరును ప్రభావితం చేస్తాయి. జీర్ణకోశ సమస్యలకు కారణం కావచ్చు. అంతేకాదు, లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పి , అలసట వస్తుంది.