రాత్రిపూట అన్నం తింటే ఏమౌతుందో తెలుసా?

First Published May 7, 2024, 10:58 AM IST

మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నాన్నే తింటుంటారు. కానీ ఇన్ని పూటలా అన్నాన్నే తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక నుంచి అలా తినే సాహసం చేయరు తెలుసా? 
 

బియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవే కాదు బియ్యంలో ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి మంచి మేలు చేస్తాయి. అయితే దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తింటే బరువు పెరిగిపోతామని చాలా మంది రాత్రి పూట అన్నానికి దూరంగా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం రాత్రిపూట ఖచ్చితంగా అన్నాన్ని తింటుంటారు. అసలు రాత్రిపూట అన్నాన్ని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బ్లడ్ షుగర్ పెరుగుతుంది

వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్లకు అంత మంచిది కాదు. వీళ్లు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలనే తినాలి. అయితే రాత్రిపూట తినడం వల్ల బ్లడ్ షుగర్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది.
 

అధిక రక్తపోటు సమస్య

బియ్యం మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట అన్నం తినడం వల్ల హైబీపీ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాత్రి పడుకునే ముందు అన్నం తినకపోవడమే మంచిది. 
 

rice

ఊబకాయం పెరుగుతుంది

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్టైతే రాత్రిపూట వైట్ రైస్ ను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే దీనిలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే మాత్రం రాత్రిళ్లు అన్నాన్ని తినకండి. 

క్యాన్సర్ ప్రమాదం 

బియ్యంలో ఆర్సెనిక్ ఉంటుంది. ఈ మూలకం శరీరంలో ఎక్కువగా చేరినప్పుడు క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మూలకం మెదడు పనితీరును కూడా తగ్గిస్తుంది.

జలుబు రావొచ్చు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట అన్నం తినడం వల్ల కూడా జలుబు సమస్య వస్తుంది. అవును చాలా మందికి ఇలా జలుబు అవుతుంటుంది. అందుకే రాత్రిపూట అన్నాన్ని తినకూడదని నిపుణులు అంటున్నారు. 
 


ఏ అన్నం తినాలి?

ఒకవేళ మీరు అన్నాన్ని తినాలనుకుంటే వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను తినండి. ఇవి వైట్ రైస్ కంటే ఆరోగ్యకరమైనవి. వీటిలో పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బరువును అస్సలు పెంచదు. 

ఏ సమయంలో అన్నం తినాలి?

అన్నాన్ని మధ్యాహ్నం పూట తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది మీకు రోజంతా అవసరమైన పిండి పదార్థాలు,ప్రోటీన్ ను అందిస్తుంది. దీంతో మీరు ఎనర్జిటిక్ గా పనిచేస్తారు.

click me!