మారుతికి ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చాడా?.. ఈ వార్తలేంటి రాజా?.. ఎంత కాలం ఈ వెయిటింగ్?

First Published May 7, 2024, 10:14 AM IST

మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2025 కు రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ...


మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. లుంగీ కట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది అన్నారు.ఇక  ఈ సినిమా షూట్ మొదలై సంవత్సరం పైగా అయ్యినా, కొద్ది శాతం షూట్ మాత్రమే జరిగినట్లు సమాచారం. అందుకు కారణం ప్రభాస్ వరస సినిమాలే అనటంలో సందేహం లేదు. యూరప్ వెకేషన్ నుంచి వచ్చాక మారుతి కి బల్క్ డేట్స్ ఇస్తానని  ప్రామిస్ సైతం ప్రభాస్ చేసారు.


ఆ క్రమంలోనే రాజా సాబ్ కోసం ఏప్రియల్, మే నెలలో డేట్స్ కేటాయించారు. అయితే ఏప్రియల్ లో కేవలం వారం రోజులు మాత్రమే ప్రభాస్ షూట్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఇక మే నెల షెడ్యూల్ అయితే వాయిదాపడిందంని అంటున్నారు. వాస్తవానికి మారుతి సినిమాని సాధ్యమైనంత త్వరలో ఫినిషే చేద్దామననేది ప్రభాస్ ప్లాన్. అయినా ఎప్పటికప్పుడు ఏదో షెడ్యూల్ తోసుకొచ్చేస్తోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు సలార్ 2 కు రంగం సిద్దమవుతోందని సమాచారం.  
 


దర్శకుడు ప్రశాంత్ స్క్రిప్టుతో, షూటింగ్ షెడ్యూల్స్ తో రావటంతో ప్రభాస్ అటు వైపే మ్రొగ్గుచూపాడంటున్నారు. రాజాసాబ్ ని రిక్వెస్ట్ చేసి షెడ్యూల్ ని వాయిదా వేసారని అంటున్నారు. సలార్ 2 లో ఫుల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో బల్క్ డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో మారుతి ఇప్పుడు మళ్లీ చాలా కాలం వెయిట్ చెయ్యాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. 

అసలు  అయితే `కేజీఎఫ్‌2` విడుదలకు ముందు `సలార్‌`కి గ్యాపిచ్చి మారుతి సినిమాని చేయాలనుకున్నారు డార్లింగ్‌. అటు `ప్రాజెక్ట్ కే`కి కూడా కొంత గ్యాప్‌ ఇచ్చి మారుతి సినిమాని రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయాలని భావించారు. కానీ `కేజీఎఫ్‌ 2` ఇచ్చిన ఊపుతో తన ప్లాన్‌ మార్చుకుని ఇప్పుడు ఫస్ట్ `సలార్‌`ని పూర్తి చేసారు ప్రభాస్‌. దీంతో మారుతి చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు.  


ఏడాదిన్నరగా మారుతి ఇదే ప్రాజెక్టు మీద ఉన్నారు. రాజాసాబ్ సినిమాని సంక్రాంతి 2025 రిలీజ్ అనుకున్నారు కానీ సలార్ 2 చిత్రం క్రిస్మస్ కు రిలీజ్ పెడుతున్నారు. దాంతో రాజా సాబ్ ని 2025 వేసవికు ఫుష్ చేసే అవకాసం ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మారుతి ఇదే ప్రాజెక్టుపై ఉండాలన్నమాట. 
 


అయితే ఈ గ్యాప్ లో మారుతి వరసపెట్టి వేరే సినిమాలు తను నిర్మాతగా,సమర్పకుడుగా చేస్తున్నారు. ఆ పనుల్లోనూ బిజీగా ఉంటున్నారు.  ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ డేట్, అప్‍డేట్లపై మారుతీకి రీసెంట్ గా  ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన స్పందించారు. 


ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా (కల్కి 2898 ఏడీ) రానుందని, దీంతో ఇప్పుడు ఆ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని మారుతీ అన్నారు. ఆ మూవీ తర్వాత ఎలాగూ రాజాసాబ్ గురించి అప్‍డేట్లు వస్తాయని ఆయన చెప్పారు. అంటే.. కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ అప్‍డేట్లు వస్తాయనేలా మారుతీ హింట్ ఇచ్చారు.
 


“ఈ సినిమా (రాజాసాబ్) గురించి కంటే.. ఆయనది ముందు ఒక పెద్ద సినిమా (కల్కి 2898 ఏడీ) ఉంది. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎలాగూ మాది ఉంటుంది. వచ్చినప్పుడు చూద్దాం” అని మారుతీ చెప్పారు.
 

 
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. సందీప్ వంగ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు. ఈలోపు సలార్ 2,రాజాసాబ్  పూర్తిచేద్దామని డార్లింగ్ ఫిక్స్ అయ్యారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.


సలార్ విషయానికి వస్తే... ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ కు పండగ చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 
 


ప్రముఖ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ పార్ట్ 2 గురించి మాట్లాడుతూ.. “స్టోరీ ఆల్రెడీ సిద్ధంగా ఉందని, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా థియేటర్స్ లోకి తీసుకు వచ్చేలా పని చేస్తామంటూ” ప్రభాస్ పేర్కొన్నారు. ఇక తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. “నాకున్న ఏకైక ‘గోల్’ నా పనితో ప్రతిఒకర్ని ఎంటర్టైన్ చేయడం. నేను ఓ సినిమాకి ఓకే చెప్పడం వెనుక మొదటి కారణం అదే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.
 


ప్రస్తుతం సలార్ 2తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకటి ఫ్యూచరిస్టిక్ సినిమా అంటూ ‘కల్కి’ గురించి మాట్లాడారు. అలాగే మారుతీ సినిమా గురించి మాట్లాడుతూ.. అది హారర్ మూవీ అని తెలియజేసారు. ఈ సినిమా హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతోందని ఇప్పటివరకు ఎటువంటి ఉహాగాన వార్తలే వచ్చాయి. తాజాగా ఇప్పుడు ప్రభాస్ చేసిన కామెంట్స్ ఆ వార్తల్ని అధికారికంగా కన్ఫార్మ్ చేసినట్లు అయ్యింది.
 

click me!