మూడ్ ని మురిపించే రంగులు.. ఇలా దుస్తులు వేసుకుంటే..రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా...

First Published Jul 21, 2021, 2:02 PM IST

ఉదయం లేవగానే బెడ్ మీదినుంచి దిగేప్పుడు రాంగ్ సైడ్ దిగారా? అయితే పసుపు రంగు దుస్తులను ఎంచుకోండి. దీంతో ఎల్లో లోని వైబ్రేషన్ మీ మానసిక స్థితిని చైతన్య పరుస్తుంది. రోజు మొత్తానికి సానుకూల, సంతోషకరంగా మారేలా చేస్తుంది.

మనిషి మూడ్ ను ప్రభావితం చేయడంతో రంగులు ప్రధాన పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే మీ ఉదయం లేవగానే మీ మూడ్ ను ప్రభావితం చేయడానికి.. రోజంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి కూడా ఈ రంగుల ఎంపిక దోహదపడుతుందట.
undefined
ఉదయం లేవగానే బెడ్ మీదినుంచి దిగేప్పుడు రాంగ్ సైడ్ దిగారా? అయితే పసుపు రంగు దుస్తులను ఎంచుకోండి. దీంతో ఎల్లో లోని వైబ్రేషన్ మీ మానసిక స్థితిని చైతన్య పరుస్తుంది. రోజు మొత్తానికి సానుకూల, సంతోషకరంగా మారేలా చేస్తుంది.
undefined
రోజు మొత్తం చాలా బిజీ షెడ్యూల్ ఉందా? అయినా కూడా ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా, రిలాక్స్ డ్ గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. ఆకుపచ్చలోని ఏ షేడ్ అయినా మీకు అదేరకమైన కంఫర్ట్ ఇస్తుంది. ప్రకృతి ప్రతిరూపంగా అనిపించే ఆకుపచ్చ మీకు సౌకర్యంగా ఉండటమే కాకుండా, ప్రశాంతంగా ఉండేలా సహాయపడుతుంది.
undefined
రోజు మొత్తం ఎనర్జిటిక్ గా ఉండాలన్నా.. ప్రయాణాల్లో ఉన్నా ఆరెంజ్ కలర్ బట్టలు ఎంచుకోండి. ఇవి మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి.
undefined
ఇంతకంటే ఎక్కువ ఎనర్జీ కావలన్నా, రోజు మొత్తం శ్రద్ధవహించాల్సిన పనులున్నట్లైతే ఎరుపురంగు దుస్తులు బాగా సూటవుతాయి.
undefined
ప్రశాంతంగా, సృజనాత్మకంగా రోజు గడపాలనుకుంటున్నారా?అయితే నీలం రంగు బెస్ట్ ఛాయిస్. బీచ్ దగ్గర ఉన్నప్పుడు వచ్చేలాంటి ప్రశాంతతను మీకు అందిస్తుంది. మీలోని సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. అంతేకాదు నీలం రంగు నరాలను ఉపశమనం కలిగిస్తుంది.
undefined
విలాసవంతంగా, ముద్దుచేసిన భావనలో ఉండాలనుకుంటే పర్పుల్ కలర్ చాలా మంచిది. మీకు రాయల్టీ వైబ్స్ ను ఇస్తుంది.
undefined
ఇక వీటన్నింటికి విరుద్ధంగా అన్ని సందర్భాలకూ సూటయ్యే, సింపుల్ అండ్ లగ్జరియస్ కలర్ తెలపు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలన్నా, సింపుల్ గా కనిపించాలన్నా తెలుపుకే సాద్యం.
undefined
ప్రతీ రంగుకు తనదైన ప్రత్యేకత ఉన్నప్పటికీ.. మీ ఇష్టాలు, అభిరుచులు, సంప్రదాయాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవడం వల్ల వాటి ప్రయోజనాలు పొందవచ్చు.
undefined
click me!