టాలీవుడ్ స్టార్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ ఇప్పుడు క్రేజీ నటిగా మారిపోయింది. పలు చిత్రాల్లో అనసూయ పోషించిన పాత్రలు ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
టాలీవుడ్ స్టార్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ ఇప్పుడు క్రేజీ నటిగా మారిపోయింది. పలు చిత్రాల్లో అనసూయ పోషించిన పాత్రలు ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లో అనసూయ అదరగొట్టేసింది.
26
అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది అని అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా అనసూయ సోషల్ మీడియాలో కాస్త ఘాటుగా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఉంటుంది.
36
అనసూయ కొన్నిసార్లు నాజూగ్గా మరికొన్నిసార్లు బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అది వర్కౌట్స్ చేయకపోవడం వల్ల కాదట. తనకి ఓ ఆరోగ్య సమస్య ఉందని అనసూయ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. తనకి సీరియస్ బ్రీతింగ్ ఇష్యూ ఉన్నట్లు అనసూయ తెలిపింది. అనసూయ డైటింగ్ చేస్తుందట. అయితే అందంగానే ఉన్నావు కదా.. డైటింగ్ ఎందుకు చేస్తున్నావు అని యాంకర్ ప్రశ్నించింది.
46
Anasuya Bharadwaj
నేను అందంగా కనిపించడం కోసం డైటింగ్ చేయడం లేదు. హెల్త్ పరంగా నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనే దానికోసమే డైట్ చేస్తున్నా. నాకు బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పిటల్ లో ఆక్సిజన్ పెట్టాల్సిన స్టేజి వరకు పరిస్థితి వెళ్ళింది. హెల్త్ పరంగా అలా సమస్యలతో ఉండడం నాకు నచ్చలేదు.
56
Anasuya bharadwaj
నేను ఎక్కువగా ఎమోషనల్ అయితే కండరాల్లో నొప్పులు వచ్చేవి. బ్రీతింగ్ సమస్య మొదలయ్యేది. అప్పటి నుంచి నేను బ్రీతింగ్ యోగ, ప్రాణాయామం చేస్తున్నానని అనసూయ తెలిపింది. వర్కౌట్ కూడా మొదలు పెట్టాను. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటాం అని అనసూయ తెలిపింది. అందుకే నన్ను మీరు రకరకాల షేపుల్లో చూస్తుంటారు.
66
నేను చిన్న కొడుకుని కన్న 20 రోజుల్లోపే షూటింగ్ కి వెళ్ళా. ఆ సమయంలో విపరీతంగా బరువు పెరిగిపోయినట్లు అనసూయ పేర్కొంది. నేను లావుగా ఉన్నానని ఫీల్ కాలేదు. నా వర్క్ నాకు ముఖ్యం అనికుని వెళ్లినట్లు అనసూయ తెలిపింది.