శృంగార రసాస్వాదనను పెంచే నల్ల జీలకర్ర..

First Published Sep 5, 2020, 5:05 PM IST

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది. అలసట, బలహీనతను తొలగించడంలో తోడ్పడుతుంది.

నల్ల జీలకర్రలో ఎన్నో ఉపయోగాలున్నాయి. వంటింట్లో రెగ్యులర్ గా దీన్ని వాడితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల జీలకర్రను శతాబ్దాలుగా మూలికా ఔషధంగా వాడుతున్నారు. మామూలు జీలకర్రకంటే ఎంతో పవర్ ఫుల్ ఈ నల్ల జీలకర్ర. మరి దీంట్లోని ఔషధ గుణాలేంటో తెలుసుకుంటే వదలిపెట్టరు.
undefined
కాస్త చేదుగా ఉండే నల్ల జీలకర్రతో ఒబేసిటీని దూరం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు మూడు నెలల పాటు నల్ల జీలకర్ర వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీనిద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. నల్ల జీలకర్ర మూత్ర విసర్జనను క్లియర్ చేస్తుంది. శరీరంలోని అధిక కొవ్వును మూత్రం ద్వారా బైటికి పోయేల చేస్తుంది. అందుకే నల్ల జీలకర్ర రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మీరు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.
undefined
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది. అలసట, బలహీనతను తొలగించడంలో తోడ్పడుతుంది. పొట్టలో వచ్చే అనేక సమస్యలను తొలగించడంలో నల్ల జీలకర్ర లోని యాంటీ మైక్రోబల్ లక్షణాలు తోడ్పడతాయి. సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్, అపానవాయువు, కడుపు నొప్పి, విరేచనాలు, కడుపు పురుగులు వంటి వాటికి ఎంతో ఉపశమనం ఇస్తుంది.
undefined
నల్ల జీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ విత్తనాల పొడిని బ్రెడ్‌, బిస్కట్లు, రొట్టెలు, ఇడ్లీ, టీ, సూప్స్‌ల్లో వేసుకుని తీసుకుంటారు. దీనిని రోజువారీ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. తేనె, నల్ల జీలకర్ర విత్తనాల పొడి, వెల్లుల్లిని కలిపి ఔషధంగా తయారుచేస్తారు. దీన్ని వాడితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
undefined
నల్ల జీలకర్ర వల్ల ఈ లాభాలే కాకుండా శృంగార రసాన్ని కూడా ఎక్కువగా ఆస్వాదించొచ్చట. అంగస్తంభన సమస్యలు ఉన్నవారికి, వీర్యకణాలు తక్కువగా ఉన్నవారికి ఈ నల్ల జీలకర్ర అద్భుత ఔషధంగా పనిచేస్తుందట.
undefined
ఒక వయసు వచ్చిన తరువాత తమలోని సెక్స్ కోరికలు తగ్గాయని చాలామంది వాపోతుంటారు. అలాంటివారి కోసం ఈ నల్ల జీలకర్ర చాలా బాగా పనిచేస్తుందట. మీలోని శక్తిని పెంచి తృప్తిని అందించడమే కాకుండా కోరికలు గుర్రాలైతే అన్నట్టుగా పరుగులు తీస్తారట.
undefined
నల్లజీలకర్ర పొడి రుచి ఉల్లి, మిరియాల రుచిని తలపిస్తుంది. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, సోడియం, జింక్‌, మాంగనీస్‌, కాపర్‌, ఐరన్‌ ఖనిజ పోషకాలుంటాయి. ఈ విత్తనాల్లోని థైమో క్వినోన్‌ బయోయాక్టివ్‌ కాంపోనెంట్‌గా పనిచేస్తుంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్నిస్తుంది.
undefined
హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి జీర్ణాశయాన్ని కాపాడతాయి. శక్తిమంతమైన యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. వీటి వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే నల్ల జీలకర్ర పొడిని అతిగా వాడకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
undefined
click me!