Edible Saree : ఈ చీరను అందంగా కట్టుకోవడమే కాదు.. రుచికరంగా తినొచ్చు కూడా..

First Published Oct 1, 2021, 12:38 PM IST

కేరళకు చెందిన అన్నా ఎలిజబెత్ తినగలిగే చీరను తయారు చేసింది. దీనికి తనకు ప్రేరణనిచ్చింది మాత్రం తన తల్లే అని చెబుతున్నారు అన్నా.. తల్లి చీరను ఆరబెట్టే టెక్నిక్ ద్వారా ప్రేరణ పొంది.. ఈ ఎడిబుర్ సారీ డిజైన్ చేశారట ఆమె. 

edible saree

కొల్లామ్‌కు చెందిన పిహెచ్‌డి విద్యార్థిని, హోమ్ బేకర్ నిర్వాహకురాలు అన్నా ఎలిజబెత్ జార్జ్‌ ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి తినగలిగే చీరను సృష్టించారు. 24  అన్నా ఎలిజబెత్ బేకరీ ఫుడ్స్ లో అందెవేసిన చేయి. ఆమె ప్రతీ ఏడాది ఓనమ్ కు ఓ స్పెషల్ ఐటమ్ ను సొంతంగా సృష్టిస్తుంది. 

edible saree

ఈ క్రమంలోనే ఈ తినగలిగే చీరను తయారు చేసిందట. దీనికి తనకు ప్రేరణనిచ్చింది మాత్రం తన తల్లే అని చెబుతున్నారు అన్నా.. తల్లి చీరను ఆరబెట్టే టెక్నిక్ ద్వారా ప్రేరణ పొంది.. ఈ ఎడిబుర్ సారీ డిజైన్ చేశారట ఆమె. అంతేకాదు ఇందులో కేరళ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం ఉట్టిపడేలా చేయాలనుకున్నారు. అలా ప్రపంచంలోని మొట్ట మొదటి 100 శాతం తినదగిన చీరను తయారు చేశారు. ఇది కేరళ ఫేమస్ గోల్డెన్ వైట్ సారీగా తయారు చేశారు. 

edible saree

అన్నా ఎలిజబెత్ హోమ్ బేకర్. ఫ్లోరిస్ట్.  ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం క్యాన్సర్, న్యూరోబయాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. అన్నా ఎప్పుడూ  బిజీగా ఉండటానికి ఇష్టపడుతుంది. అందుకే అన్నా తన దినచర్యను రెండు భాగాలుగా విభజించింది. ఉదయం వేళల్లో చదువుపై దృష్టి పెడుతుంది. మధ్యాహ్నం నుంచి బేకింగ్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. బేకింగ్ మీద తన ఆసక్తికి, తాను సాధించిన వాటికి తన తల్లి, తాతలే కారణం అంటుంది. ఆమె తాత జ్ఞాపకార్థం.. తాతా పేరుతో జాకబ్ ఫ్లోరల్స్, జాకబ్ బేక్స్ వెంచర్స్ ను కూడా నిర్వహిస్తుంది.

edible saree

ఈ ఎడిబుల్ సారీని ఎలా తయారు చేశారు అని అడిగితే.. ఆమె ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. “చీర బేస్ కోసం స్టార్చ్ ఆధారిత వేఫర్ పేపర్ ను ఉపయోగించాను. ఈ వేఫర్ పేపర్ ను బంగాళాదుంప, బియ్యం పిండితో తయారు చేస్తారు’’ అని చెప్పుకొచ్చింది. చీరలాగా ఖచ్చితమైన పొడవు, ఆకృతి రావడం కోసం పొందడానికి A4 షీట్ కొలతతో మొత్తం 100 వేఫర్ పేపర్ లను ఉపయోగించింది. దీని గురించి ఇంకా చెబుతూ.. "గోల్డెన్ జరీ బార్డర్ లుక్ పొందడానికి.. గోల్డ్ డస్ట్ లస్టర్ ను ఉపయోగించాను. అలాగే కేక్ డెకరేషన్‌ల మాదిరిగానే ప్యాటర్న్‌లను తయారు చేసాను." అని చెప్పుకొచ్చారు. 

edible saree

అయితే ఇదంతా అంత సులభంగా ఏమీ జరగలేదట. కాకపోతే పట్టుదలతో ప్రయత్నించడం వల్ల చివరికి అన్నా దీనిని సాధించానంటోంది.  2 కిలోల బరువున్న చీరను తయారు చేయడానికి ఆమెకు 1.5 వారాలు పట్టింది. పరిశోధన మొదలు.. ఈ ఎడిబుల్ చీరకు ప్రాణం పోసేందుకు 1.5 నెలలకు పైగా పట్టిందట. దీన్ని ఆమె గుర్తు చేసుకుంటూ.. “పగటిపూట చదువుకుంటూ, మధ్యాహ్నం కేక్ ఆర్డర్స్ తీసుకుంటూ వాటిని తయారు చేసేదాన్ని..రాత్రి పూట మాత్రమే ఈ చీర మీద ప్రయోగాలు చేసేదాన్ని’ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎదురైన కష్టాల గురించి మాట్లాడుతూ, " 5.5 మీటర్ల చీర తయారు చేయడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించాను. దాని కోసం 3 ప్లైవుడ్ షీట్‌లను ఉపయోగించా. ఇంట్లోని రెండు డైనింగ్ టేబుల్స్‌ను ఒకదగ్గర చేర్చి.. దానిమీద ఫ్లై వుడ్ యాడ్ చేసి.. చాలా కష్టం మీద ఈ చీరను సృష్టించాను" అని చెబుతున్నారామె.

edible saree

ఈ చీర కోసం అన్నాకు మొత్తం రూ. 30000 అయ్యిందట. అంటే చీర తయారీలో పరిశోధననుంచి జరిగిన మొత్తం ఖర్చు ఇది అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కస్టమర్లకు ఈ చీర ధర రూ.10వేల నుంచి మొదలవుతుందని అన్నారు. చీరమీద డిటైలింగ్ , స్పెసిఫికేషన్స్ ను బట్టి చీర రేటు మారుతుందని చెప్పుకొచ్చారు. 

చీరతో ఆగిపోతే ఆమె అన్నా ఎలిజబెత్ ఎలా అవుతుంది. అందుకే ఆమె “నేను త్వరలో దుపట్టను డిజైన్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇది దాని ప్రత్యేకతతో ఉంటుంది. ఈ దుపట్టాలు కావాలంటే ముందుగా ఆర్డర్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు త్వరలో, క్యాన్సర్, న్యూరోబయాలజీలో పీహెచ్‌డీ కోసం విదేశాలకు వెళ్తున్నానని.. అయినా, బేకింగ్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకొని మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. 

click me!