High Protein Breakfast: ప్రోటీన్ ఫుడ్ ను బ్రేక్ ఫాస్ట్ లో తినాలని చెప్పేది ఇందుకోసమే..

First Published Aug 5, 2022, 4:03 PM IST

High Protein Breakfast: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల బరువు సునాయాసంగా తగ్గడంతో పాటుగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

చెడు ఆహారపు అలవాట్ల వల్ల శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది. అందులోనూ ఈ రోజుల్లో ఊబకాయం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఇక చాలా మంది బరువును తగ్గించుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు. అంతే కాదు కేలరీలు తగ్గిపోవాలని ఫుడ్ ను కూడా మానేసే వారున్నారు. నిజానికి ఆహారాన్ని తగ్గిస్తే బరువు తగ్గుతారనేది మీ అపోహ మాత్రమే. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ ను తీసుకుంటేనే  మీ శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. దీంతో మీరు మరింత ఎక్కువ వ్యాయామం చేసి కేలరీలను కరిగిస్తారు.

మన ఆహారపు అలవాట్లపైనే మనం బరువు తగ్గాలో? పెరగాలో ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార నిపుణులు లవ్నీత్ బాత్రా ప్రకారం.. ఏయే సమయాల్లో ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకుంటే సులువుగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. 
 

protein

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.  బ్రేక్ ఫాస్ట్ లో కనీసం 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవాలి. 

protein

బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఫుడ్ న తినడం వల్ల ఆ రోజంతా మీరు ఎనర్జిట్ గా ఉంటారు. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని తినాలన్న కోరికలు కూడా తగ్గుతాయి. ఇది మీ బరువును వేగంగా తగ్గడానికి ఎంతో సహాయడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. మొత్తంగా ప్రోటీన్ ఫుడ్ ను తింటే కిలోల్లో బరువును తగ్గుతారు. 

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ప్రోటీన్ ఫుడ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఎవరైతే ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తింటారో వారి బెల్లీ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుందట. విటమిన్ కె కూడా బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గిస్తుంది. ఇందుకోసం బ్రోకలీ, బచ్చలికూరను ను తినాలి. మీ రోజు వారి ఆహారంలో మంచి కొవ్వులతో పాటుగా.. బాదం, వాల్ నట్స్, ఆలివ్ ఆయిల్, వేరుశెనగ, జీడిపప్పులు ఉండేట్టు చూసుకోవాలి. 

బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాట్స్,  ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ ఇ,  థయాబిన్, ఫోలేట్  లు పుష్కలంగా ఉంటాయి.
 

బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటుగా, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. 

వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా జీడిపప్పులను మితంగా తింటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. 

click me!