హైబీపీ తో బాధపడేవారు ఈ విషయాలను అస్సలు మర్చిపోకూడదు

First Published Jan 8, 2023, 3:03 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. స్మోకింగ్, ఆల్కహాల్, ఊబకాయం, ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. 
 

blood pressure

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అనికూడా అంటారు. ఎందుకంటే ఇది ఎంతో మంది ప్రాణాలను సైలెంట్ గా తీస్తోంది. ఈ రక్తపోటును సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స పొందకపోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రక్తపోటు.. గుండెపోటు, స్ట్రోకులు, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మొదలైనవి రక్తపోటును పెంచుతాయి. బీపీని తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పును తగ్గించాలి

రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో మార్పులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ ఆహారంలో సోడియం లేదా ఉప్పు మొత్తాన్ని తగ్గించండి. ప్యాకేజీ చేసిన ఆహారాలను, ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాల వాడకాన్ని తగ్గించండి లేదా పూర్తిగా తినడం మానేయండి. రక్తపోటును నియంత్రించడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇవి బీపీ పెరగకుండా చూస్తాయి. 

అధిక బరువు

బరువు పెరగడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అందుకే అదనపు బరువును తగ్గించడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయండి. బరువు ఎక్కువగా ఉండే బీపీతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

వ్యాయామం

వ్యాయామం కూడా అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అందుకే హై బీపీ పేషెంట్లు రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
 

స్మోకింగ్ మానేయాలి

ధూమపానం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ధూమపానం హృదయ సంబంధ వ్యాధులు,  క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు కూడా దారితీస్తుంది. అందుకే ధూమపానాన్ని పూర్తిగా మానేయండి.

ఆకు కూరలను తినండి

అధిక రక్తపోటు పేషెంట్లకు ఆకు కూరలు ఎంతో మేలు చేస్తాయి. బచ్చలికూర, మునగ ఆకులు ఇనుముకు అద్భుతమైన వనరులు. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు అధిక రక్తపోటు ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. 

Image: Getty Images

బీట్ రూట్

బీట్రూట్ పోషకాల భాండాగారం. ఈ  బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మొత్తంగా ఇది రక్తపోటును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.

Image: Getty Images

అవొకాడో

అవోకాడో రసం కూడా బీపీ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. అవోకాడోల్లో పొటాషియం, ఫోలేట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా బాగుంటుంది. 

అరటిపండ్లు

అరటి పండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మీడియం సైజు అరటి పండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. పొటాషియం రక్త నాళాల గోడలోని ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

click me!