బాత్ టవల్ తో సమంత పిక్ వైరల్.. న్యూడ్ గా అంటూ దుష్ప్రచారం, జరిగింది ఇదే

First Published May 5, 2024, 10:51 PM IST

సమంత ఈ పోస్ట్ చేయగానే ఆమెపై ఒక దుష్ప్రచారం మొదలయింది. కొందరు ఆకతాయిలు సమంత అంటూ ఫేక్  న్యూడ్ పిక్ ని వైరల్ చేశారు. 

సామ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఏమాయ చేసావో చిత్రతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న నటి. సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉంది. తెలుగులో ఆమె ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదు. ఖుషి తర్వాత సామ్ ని వెండి తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

సమంత చేసే ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. మాయోసైటిస్ నుంచి సమంత కోలుకున్న తర్వాత హెల్త్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటోంది. 

సమంత తన ఆరోగ్యం, శక్తి మెరుగు పరుచుకునేందుకు ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ గుడులు గోపురాలు తిరుగుతోంది. యోగ లాంటి పద్ధతులు కూడా పాటిస్తోంది. 

అదే విధంగా వైద్యుల సలహా మేరకు కొన్ని చికిత్సలు తీసుకుంటోంది. తాజాగా సమంత బాత్ టవల్ చుట్టుకుని ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. ఇలా ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా సమంత పేర్కొంది. 

రక్తప్రసరణ, మెటబాలిజం పెరగడం, మజిల్ స్ట్రెంత్ పెరగడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలని సమంత పేర్కొంది. అయితే సమంత ఈ పోస్ట్ చేయగానే ఆమెపై ఒక దుష్ప్రచారం మొదలయింది. కొందరు ఆకతాయిలు సమంత అంటూ ఫేక్  న్యూడ్ పిక్ ని వైరల్ చేశారు. 

సమంత ఈ న్యూడ్ పిక్ ని పోస్ట్ చేసి డిలీట్ చేసింది అంటూ అసత్య ప్రచారం చేశారు. కానీ అది వాస్తవం కాదు. సమంత బాత్ టవల్ చుట్టుకుని ఉన్న పిక్ ని మాత్రమే పోస్ట్ చేసింది. ఆమె ఎలాంటి న్యూడ్ ఫోటో షేర్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయలేదు. కొందరు ఆకతాయిలు సృష్టించిన ఫేక్ ఫొటో ని సామ్ అభిమానులు తిప్పి కొడుతూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

click me!