ఈ ఆరింటిని తింటే మీ బీపీ పెరిగే అవకాశమే ఉండదు..!

First Published Aug 20, 2022, 3:13 PM IST

అధిక రక్తపోటు ధమనులలో స్ట్రోక్, రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజూ తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. 
 

బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఈ వ్యాధి సర్వసాధారణం అయిపోయింది. ఈ రక్తపోటు సమస్యను గుర్తించకపోతే.. ప్రాణాల మీదికే వస్తుంది. అయితే రక్తపోటు పెరిగితే ధమనులలో స్ట్రోక్, రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. 
 

leafy vegetables

ఆకు కూరలు

ఆకు కూరలు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే బచ్చలికూర, మునగాకులు కూడా రక్తపోటును తగ్గిస్తాయి. వీటిలో ఇనుము, నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. 
 

బీట్ రూట్

బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్ రూట్ లో నైట్రేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించడమే .. రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. 
 

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.  ఇది రక్తనాళాలను విస్తరించే నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్నిపెంచడానికి సహాయపడుతుంది. రోజుకు  3 నుంచి 4  వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. 

అల్లం

అల్లం కూడా హై బీపీని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ రోజు వారి ఆహారంలో అల్లాన్ని చేర్చుకున్నా.. అల్లం టీని తాగినా.. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. 
 

అరటి పండ్లు

అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఒక మీడియం సైజు అరటిలో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
 

గుమ్మడికాయ గింజలు

గుమ్మడి గింజల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, అర్జినిన్ వంటి పోషకాలకు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి అవసరమైన  అమైనో ఆమ్లం రక్తపోటును తగ్గించడానికి చాలా అవసరం. గుమ్మడికాయ గింజలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

click me!