ఈ అలవాట్లే రాత్రిళ్లు నిద్రపట్టకుండా చేస్తాయి..

First Published Dec 26, 2022, 3:58 PM IST

రాత్రిపూట 10 లేదా 11 గంటలకు ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బాగుంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. సరైన టైంలో పడుకుంటేనే మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే.. 

అలసట  మనల్ని ఏ పనులను చేయనీయదు. ముఖ్యంగా పనుల పట్ల ఇంట్రెస్ట్ ను పూర్తిగా తగ్గిస్తుంది. నిజానికి ఈ అలసట, పనుల పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం నిద్రలేమి లక్షణాలు. దీనర్థం మీరు కంటినిండా నిద్రపోవడం లేదని. అవసరమైన దానికంటే తక్కువ గంటలు నిద్రపోతున్నారని అర్థం. పలు పరిశోధనల ప్రకారం.. రాత్రి 10, 11 గంటల మధ్య నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి ఉత్తమ సమయం. ఈ సమయం దాటితే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గుండె పనితీరు దెబ్బతింటుంది. 

కంటినిండా నిద్రపోకపోవడం వల్ల ఆకలి కోరికలు బాగా పెరుగుతాయి. దీంతో మీరు అతిగా తిని బరువు బాగా పెరుగుతారు. ముఖ్యంగా అర్థరాత్రి వరకు మెలుకువగా ఉండటం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. బాడీలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అసలు రాత్రిళ్లు ఎందుకు నిద్రరాదో ఇప్పుడు తెలుసుకుందాం..  

పడుకునే టైంలో ఫోన్ వాడటం

ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ సిర్కాడియన్ లయలను దెబ్బతీస్తుంది. దీనివల్ల మీకు నిద్ర రాదు. విశ్రాంతిని కూడా తీసుకోనియదు. ఈ బ్లూ లైట్ మీ నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. తగినంత మెలటోనిన్ లేకపోవడం వల్ల నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది మీరు పగటి పూట నిద్రపోయేలా చేస్తుంది. 
 

పడుకునే ముందు హెవీగా తినడం

నిద్రపోయే ముందు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల జీర్ణసమస్యలు వస్తాయి. దీంతో మీరు రాత్రిళ్లు  సరైన టైంకి పడుకోలేరు. ఎందుకంటే మీ శరీరం ఇప్పటికీ మీరు తిన్న భోజనాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రాత్రిళ్లు నిద్రపోవడానికి ఒకటి లేదా రెండు గంటల ముందే తినండి. 
 

కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం

టీ, కాఫీల్లో కెఫిన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎప్పుడో ఒకసారి తాగితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ అదె పనిగా తాగితే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ మీ నిద్రను దూరం చేస్తుంది. దీనివల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మీరు ఎటు దొర్లినా నిద్ర మాత్రం పోలేరు. 
 

సూర్య రశ్మి తగలకపోవడం

సహజ కాంతి అయిన సూర్యరశ్మి కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. మన శరీరానికి సూర్యరశ్మి తగలకపోతే  మెలటోనిన్ ఉత్పత్తి సరిగ్గా ఉండదు. ఈ మెలటోనిన్ మనం రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి మెలటోనిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తుంది.
 

ఒత్తిడి పెరగడం

ఒత్తిడి స్థాయిలు పెరిగితే కూడా నిద్రపట్టడం కష్టంగా మారుతుంది. ఒత్తిడి నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రశాతంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. అదే నిద్రలేకుంటే ఈ ఒత్తిడి ఇంకాస్త పెరుగుతుంది. ఒత్తిడి కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది నిద్రకు మరింత అంతరాయాన్ని కలిగిస్తుంది. 

click me!