చలికాలంలో మీ చర్మం తేమగా, అందంగా ఉండటానికి వీటిని ఖచ్చితంగా తినండి..

First Published Dec 22, 2022, 11:02 AM IST

చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంది. దీంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్యకు ఎన్ని క్రీం లను రాసినా.. చర్మం ఏమాత్రం మారదు. అయితే కొన్ని రకాల  ఆహారాలు మాత్రం చర్మాన్ని తేమగా, కాంతివంతంగా చేయడానికి ఎంతో సహాయపడతాయి. 

skin care

చలికాలంలో వీచే చల్లని గాలులు, వేడి, తక్కువ, తేమ స్థాయిలు చర్మం తేమను కోల్పోయేలా చేస్తాయి. దీనివల్ల స్కిన్ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల ముఖం, చేతులు, కాళ్లు, బయటకు కనిపించే ఇతర భాగాల చర్మం ప్రకాశవంతంగా అస్సలు కనిపించదు. ముఖ్యంగా ఈ చర్మం నిర్జీవంగా మారిపోతుంది. 

ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, చలికాలంలో పొడి, చల్లని గాలిని నివారించడానికి ఎలాంటి మార్గాలు ఉండవు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీరు చేయగలిగే కొన్ని పనులు ఉన్నాయి. ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను తింటే చర్మం తేమగా, అందంగా మెరిసిపోతుంది. అవేంటంటే.. 
 

kiwi

కివీ

విటమిన్ సి కి మరొక అద్భుతమైన మూలం కివిఫ్రూట్. దీనిలో విటమిన్ సి 64 మి.గ్రాములు ఉంటుంది. నిజానికి మన శరీరంలో విటమిన్ సి లేకపోవడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇనుము లోపం, కీళ్ల నొప్పులు, గాయాలు నెమ్మదిగా మారడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు రాకూడదంటే.. బాడీ హైడ్రేట్ గా ఉంటాలి. అలాగే శరీరంలో విటమిన్ సి స్థాయిలు మెండుగా ఉండాలి. 

oats

ఓట్ మీల్

ఓట్ మీల్ లో ఫైబర్ తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎరుపు  దనాన్ని తగ్గించడానికి, డెడ్ స్కిన్ ను నివారించడానికి ఫైబర్ ఎంతో సహాయపడుతుంది. ఈ ఫైబర్ కంటెంట్  మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది. స్కిన్ డ్రైగా మారకూడదంటే.. ఎక్కువ చక్కెర, ఉప్పు, తీపి స్నాక్స్ ను తినకండి. వీటివల్లే చర్మం పొడిబారుతుంది. 
 

coconut oil

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీన్ని చర్మానికి రాయడం వల్ల చికాకు తగ్గుతుంది. అలాగే చర్మం తేమను నింపుకోవడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె సంతృప్త కొవ్వు. ఇది ఒక్క చర్మానికే కాదు జుట్టుకు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్ గా బాగా పనిచేస్తుంది.
 


సాల్మన్

సాల్మన్ పొడి చర్మానికి అద్భుతమైన ఆహారం.  ఎందుకంటే దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మ కణాలకు సహాయపడతాయి. క్యాన్సర్ తో పోరాడటానికి కూడా సహాయపడుతాయి. అలాగే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. హాలిబట్, ఎల్లోఫిన్ ట్యూనా వంటి కొన్ని చేపలలో కనిపించే సెలీనియం చర్మంలోని ఎలాస్టిన్ ను రక్షించడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, గట్టిగా ఉంచుతుంది. ఒకవేళ మీరు చేపలను తినకపోతే... కొల్లాజెన్ ను నిర్వహించడానికి, మంటను తగ్గించడానికి, చర్మాన్ని దృఢంగా ఉంచడానికి చియా విత్తనాలు, వాల నట్స్, అవిసె గింజలు, గుడ్డు సొన  వంటి ఇతర ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినొచ్చు.
 

క్యారెట్లు

కొల్లాజెన్ ఏర్పడటానికి అవసరమైన విటమిన్ సి క్యారెట్లలో సమృద్ధిగా ఉంటుంది. చర్మాన్ని తాజాగా, తేమగా ఉండటానికి కొల్లాజెన్ చాలా అవసరం. క్యారెట్లలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది కూడా. ముడతలను తగ్గిస్తుంది. అంతేకాదు దృఢమైన చర్మాన్ని నిర్వహించే కణజాలాన్ని సృష్టించే కణాలు విటమిన్ ఎ ద్వారా ప్రేరేపించబడతాయి.
 

దోసకాయలు

చర్మ వాపును తగ్గించడానికి కీరదోసకాయలు ఎంతో సహాయపడతాయి. వీటిని ముక్కలుగా కోసి కళ్ల చుట్టూ పెడితే.. కళ్ల చుట్టూ ఉన్న వాపు తగ్గిపోతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి సలాడ్ లో వేసుకుని తింటే చర్మం తాజాగా, అందంగా మెరిసిపోతుంది. వీటిలో ఉండే విటమిన్ సి చర్మపు మంటను తగ్గిస్తుంది. దోసకాయ తొక్కలో సిలికా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పోషణను ఇస్తుంది.
 

nuts

గింజలు, విత్తనాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అన్ని రకాల గింజలు, విత్తనాల్లో ఉంటాయి. గింజలు, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తేమను అలాగే ఉంచేందుకు సహాయపడతాయి. గింజలు, విత్తనాలు చర్మాన్ని తేమగా చేస్తాయి. దాని స్థితిస్థాపకతను పెంచుతాయి. కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. 

click me!