ఓ టైమ్ లో తాగుడుకు బానిసయ్యా...బహిరంగంగా చెప్పిన మాజీ హీరోయిన్

Published : Apr 26, 2024, 07:46 AM IST

తాను మధ్యం తాగుతానని, ఆ అలవాటు రాను రాను వ్యసనంగా మారిపోయిందని తెలిపింది

PREV
17
 ఓ టైమ్ లో తాగుడుకు బానిసయ్యా...బహిరంగంగా చెప్పిన మాజీ హీరోయిన్
Pooja Bhatt


తాను మధ్యం తాగుతానని, ఆ అలవాటు రాను రాను వ్యసనంగా మారిపోయిందని తెలిపింది. అయితే తన 44వ ఏట మధ్యపాన అలవాటును వదిలించుకున్నానని పూజ భట్ తెలిపింది. నటి, దర్శకురాలు, బిగ్ బాస్ ఓటిటి 2 ఫేమ్ పూజ భట్..రీసెంట్ గా టిప్సీ అనే బాలీవుడ్ చిత్రం ట్రైలర్ లాంచ్ కు హాజరై ఈ విషయాలు చెప్పుకొచ్చింది. తన సన్నిహితుడు, మిత్రుడైన దీపక్ తిజోరి డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆమె నటించింది కూడా. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కు హాజరయ్యి తను మద్యానికి బానిసై,ఇబ్బంది పడిన విషయం, దాన్నుంచి బయిటపడిన విషయం చెప్పుకొచ్చింది.

27
Pooja Bhatt


పూజ మాట్లాడుతూ... "నేను నిర్మహమాటంగా చెప్పేస్తున్నాను..ఓ టైమ్ లో నేను తాగుడుకు బానిసయ్యాను. ఏడున్నరేళ్లు దానితో పాటు సహజీవనం చేసాను. ఆ తర్వాత మెల్లిగా దాన్నుంచి బయిటపడ్డాను. అది చెప్పుకోవటానికి సిగ్గుపడను. ," అంది.

37
Pooja Bhatt

"   మేము ఆడవాళ్లం కూడా తాగుతాము. మేము దాన్నుంచి బయిటపడతాం. మేము ఒంటిరితనం,బాధ వంటివాటిని ఎక్సపీరియన్స్ చేస్తాము. అలాగే ఈ జనరేషన్ లో ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటున్నాము. మాకు చాలా సమస్యలు ఉంటున్నాయి.  దాంతో కొందరం డ్రింక్స్ కు అలవాటు పడుతున్నాము. అయితే మేము త్వరగానే దాన్నుంచి బయిటపడగలం. అలా బయిటపడనివాళ్లు వినాసనం కోరి తెచ్చుకున్నట్లే. ఇలాంటి సినిమాలు ఆడవాళ్ల కోణం నుంచి కూడా తీయటం హ్యాపీగా ఉంది ." అని చెప్పుకొచ్చింది.

47
pooja bhatt


 ఓ టైమ్ లో తనను అందరు తనకున్న అలవాటుతో తాగుబోతు అని పిలిచేవారని, కానీ నేను మానేశాను అని చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది. .అప్పుడు పూర్తిగా మద్యం నుంచి బయటపడాలకున్నట్లుగా చెప్పింది. కానీ ఆ సమయంలో తన ఆలోచనలను బయటపడేయడం చాలా కష్టంగా అనిపించిందని.. మద్యం మానేయడానికి తను నిజంగా ఓ పోరాటం చేశానని చెప్పుకొచ్చింది. 

57
Pooja Bhatt


అయితే చాలా మంది ఆడవాళ్లు ఈ విషయం బయటకు చెప్పడానికి భయపడతారని.. కానీ ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుందని ఫూజా భట్ తెలిపింది. ఇప్పటికైనా ఆడవాళ్లు ఈ విషయంపై మహిరంగంగా మాట్లాడాలని… అలాంటివారికి స్పూర్తి నింపాడానికి ఇప్పుడు తను ఈ విషయంపై మాట్లాడాల్సి వచ్చిందన్నారు. 

67


తన తండ్రి మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లోనే డాడీ అనే సినిమా వచ్చింది. అందులో పరిస్థితుల ప్రభావం కారణంగా తన తండ్రి మద్యానికి బానిసవుతాడని, ఆ వ్యసనం నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చే కూతురి పాత్రలో తాను నటించానని పూజా తెలిపారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ మాదిరిగానే నిజ జీవితంలోనూ మద్యానికి బానిసైనట్లు వెల్లడించింది. ఈ మూవీలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని దాని నుంచి ఆయనను బయటకు పడేసే కూతురి పాత్రలో నటించానని.. కానీ నిజ జీవితంలో తనే విపరీతంగా మద్యం సేవించేదాన్ని అని తెలిపింది. 

77


పూజా భట్.. సడక్, జానమ్, జునూన్, హమ్ దోనో, గుణఘర్, అంగ్రాక్షక్, చాహత్, తమన్నా, బోర్డర్, జఖ్మ్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే 2004లో వచ్చిన జాబ్ అబ్రహం, ఉడితా గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన పాప్ సినిమాకు పూజా దర్శకత్వం వహించింది. ఇటీవల విడుదలైన బాంబే బేగమ్ వెబ్ సిరీస్‏లోనూ పూజా భట్ కనిపించింది.
 

Read more Photos on
click me!

Recommended Stories