Top 10 Tier 2 Heroes: విజయ్ దేవరకొండ-నాని లలో ఎవరు నెంబర్ వన్...లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్!

Published : Apr 26, 2024, 07:12 AM IST

టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ ఎవరో తేలిపోయింది. లేటెస్ట్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాని, విజయ్ దేవరకొండ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. టాప్ 10 టైర్ టు హీరోలు ఎవరంటే?  

PREV
18
Top 10 Tier 2 Heroes: విజయ్ దేవరకొండ-నాని లలో ఎవరు నెంబర్ వన్...లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్!
Top 10 Tier 2 Heroes


నెంబర్ వన్ ఎవరు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి రంగంలో ఒకరు టాప్ లో ఉంటారు. ప్రతి ఒక్కరు అందరి కంటే ముందంజలో ఉండాలని కోరుకుంటారు. మరి టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో కూడా గట్టి పోటీ నెలకొని ఉంది. టాప్ 10లో టైర్ 2 హీరోలు ఎవరో చూద్దాం... 
 

28
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ-నాని మధ్య నెంబర్ వన్ పొజిషన్ కోసం గట్టి పోటీ నడుస్తుంది. అనూహ్యంగా విజయ్ దేవరకొండ మొదటి స్థానం కైవశం చేసుకున్నాడు.  తాజా సర్వే లో విజయ్ దేవరకొండ 1వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. వరుస ప్లాప్స్ ఎదురవుతున్నా విజయ్ దేవరకొండ ఫేమ్ తగ్గడం లేదు. 

38

నాని గత ఏడాది వరుస హిట్స్ ఇచ్చాడు. దసరా బ్లాక్ బస్టర్ కాగా, హాయ్ నాన్న సూపర్ హిట్ కొట్టింది. అయినప్పటకీ నాని నెంబర్ వన్ ర్యాంక్ కోల్పోవడం అనూహ్య పరిణామం. తాజా సర్వే ప్రకారం నాని 2వ స్థానంలో నిలిచాడు. నెక్స్ట్ నాని సరిపోదా శనివారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

48

ఇక 3వ  స్థానంలో రామ్ పోతినేని నిలిచాడు. రామ్ పోతినేనికి సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం స్కంద నిరాశపరిచింది. అయినప్పటికీ రామ్ పోతినేని టాప్ 3లో చోటు దక్కించుకున్నాడు. 

58
Naga Chaitanya

ఇక అక్కినేని హీరో నాగ చైతన్యకు 4వ స్థానం దక్కింది. నెంబర్ వన్ పొజీషన్ లో ఉండాల్సిన ఈ స్టార్ కిడ్ గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా ఆడితే నాగ చైతన్య ర్యాంక్ పెరగవచ్చు. 
 

68

టాప్ 5లో చోటు దక్కించుకున్న టైర్ టు హీరో సాయి ధరమ్ తేజ్. ప్రమాదం నుండి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. అనంతరం పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. 
 

78

ఇక టాప్ 10లో ఉన్న మిగతా యంగ్ హీరోలను పరిశీలిస్తే... 6వ స్థానం నిఖిల్ సిద్ధార్థ్ కు దక్కింది. ఆయన ప్రస్తుతం స్వయంభు టైటిల్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. 7వ స్థానం నవీన్ పోలిశెట్టికి దక్కింది. 

 

88

ఇక 8వ స్థానంలో అడివి శేష్, 9వ స్థానంలో శర్వానంద్ నిలిచారు. అనూహ్యంగా 10వ స్థానానికి వరుణ్ తేజ్ పడిపోయాడు. వరుణ్ తేజ్ ని వరుస పరాజయాలు వెంటాడుతున్న తరుణంలో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. తాజా సర్వే ప్రకారం టాప్ 10 టైర్ టు హీరోల జాబితా ఇలా ఉంది... 

Read more Photos on
click me!

Recommended Stories