మీ గట్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ విటమిన్లను ఖచ్చితంగా తీసుకోండి..

First Published Jan 8, 2023, 4:09 PM IST

సమతుల్య ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ పోషకాలే మన శరీరం మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని విటమిన్లు మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటంటే.. 

gut health

విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.  ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరంలో విటమిన్ల లోపం వల్ల ఒత్తిడి పెరగడం, హార్మోన్ల అసమానతలు, రక్తహీనత, బలహీనత, అలసట వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ విటమిన్లు మన శరీరంలో వివిధ విధులను సులభతరం చేయడానికి ఎంతో సహాయపడతాయి. విటమిన్లు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచుతాయి. ఈ విటమిన్లు మన గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. 

మన శరీరంలో 40 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఎక్కువ భాగం మన గట్ లోనే ఉంటాయి. వీటిని సమిష్టిగా గట్ మైక్రోబయోమ్ అని పిలుస్తారు. గట్ బగ్స్ అని కూడా పిలువబడే సూక్ష్మజీవులు అనేక శరీర ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో జీవక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నియంత్రణ ప్రక్రియలు ఉంటాయి. ఆరోగ్యకరమైన మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యం కోసం గట్ బగ్స్ ఉపయోగపడతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నారు. కొన్ని రకాల విటమిన్లు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 
 

విటమిన్ సి

బలమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబును తగ్గిస్తుంది. ఈ విటమిన్ దంతాలను బలంగా చేస్తుంది. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇనుమును గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. రోజు వారి మల్టీ విటమిన్లు, సప్లిమెంట్లలో విటమిన్ సి ఉంటుంది. టాన్జేరిన్ పండ్లు, బెర్రీలు, టమోటాలు, బ్రోకలీ వంట సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 

 విటమిన్ ఎ

విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కంటి చూపును పెంచుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. క్యారెట్లు, చిలగడదుంపలు, కాలే, ఇతర ముదురు ఆకుకూరలతో పాటు కాలేయం, పాలతో సహా రంగురంగుల పండ్లు, కూరగాయలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియలో దీని ప్రత్యక్ష పాత్ర లేనప్పటికీ.. ఎన్నో జీర్ణశయాంతర సమస్యల నుంచి కాపాడుతుంది. 
 

 బి విటమిన్లు

ఈ విటమిన్లు ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. అంతేకాదు మనం తిన్న ఆహారం నుంచి శక్తిని గ్రహించడానికి సహాయపడతాయి. చేపలు, పౌల్ట్రీ, మాంసం, పాల ఉత్పత్తులతో పాటు ఆకుకూరలు, బీన్స్  లో విటమిన్ బిలతో పాటుగాఎన్నో రకాల ప్రోటీన్లలో ఉంటాయి. బి విటమిన్లు మీ రోజు వారి ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే అవి నీటిలో కరిగేవి. అలాగే  ఇవి తర్వాత అవసరాల కోసం మీ కొవ్వు కణాలలో నిల్వ చేయబడవు.

విటమిన్ డి

ఆరోగ్యకరమైన నరాలు, కండరాలు, రోగనిరోధక వ్యవస్థకు అలాగే శరీరం కాల్షియం శోషణకు విటమిన్ డి చాలా అవసరం. గట్ పై చేసిన అధ్యయనాలు.. మంచి విటమిన్ డి స్థాయిలు పెద్దప్రేగు క్యాన్సర్ తక్కువ ప్రమాదంతో ముడిపడి ఉన్నాయని కనుగొన్నాయి. విటమిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే విటమిన్ డి మాత్రలు కూడా ఉంటాయి. సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డిని పొందొచ్చు. 

click me!