సర్ ఎందుకో చెప్పండి, ఫోన్ కలిపి ఇస్తానని అన్నాడట. అయినా, వినలేదట బాలయ్య. ఏ మీ వైఫ్ నెంబర్ ఇవ్వకూడదా? నేను మాట్లాడకూడదా అని అడిగాడట. సమీర్‌కి ఏం తోయడం లేదు. కాస్త టెన్షన్ టెన్షన్‌గానే ఇచ్చాడట. దీంతో తనముందే తన భార్యకి ఫోన్ చేసి ఆయన మాట్లాడిన మాటలకు షాక్ అయ్యాడట. సమీర్ భార్యకి ఫోన్ చేసిన బాలయ్య.. మీ సమీర్ సెట్‌కి రాలేదు, ఆయన కోసం టీమ్ అంతా వెయిట్ చేస్తున్నాం, ఫోన్ ఎత్తడం లేదు, మీకు తెలుసేమో అని, మీ నెంబర్ కనుక్కుని ఫోన్ చేస్తున్నా అని మాట్లాడాడట బాలయ్య. ఆయన రాకపోతే సినిమా ప్యాకప్ చెప్పేస్తామనే రేంజ్‌లో బెదిరించాడట. మొదట ఆమె నమ్మకపోవడంతో తాను హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పాడట.