కంటి నొప్పిని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం..

First Published Feb 5, 2023, 11:51 AM IST

కళ్లకు రెస్ట్ ఇవ్వకుంటే కళ్లు బాగా అలసిపోతాయి. దీనివల్ల కంటి నొప్పి కూడా వస్తుంది. కళ్ల నుంచి అపుడప్పుడు నీళ్లు కూడా వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కంటి నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. 

eye health

గ్యాప్ ఇవ్వకుండా టీవీ, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం, పుస్తకాలను  చదవడం వంటి అలవాట్ల వల్ల కళ్లు బాగా ప్రభావితం అవుతాయి. అయినా ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు.. ప్రతి ఒక్కరూ వీటికి బాగా అలవాటు పడ్డారు. కానీ వీటివల్ల కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఎన్నో కంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు కంటి నొప్పి కూడా కలుగుతుంది. 

కంటి నొప్పి లక్షణాలు: కంటి ఒత్తిడికి ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రభావితమవుతారు. కంటి ఒత్తిడి సాధారణ సంకేతాలు ఎలా ఉంటాయంటే.. 

కంటి అలసట, పుండ్లు, దురద, 

కంటి చిరాకు

కళ్లు పొడిబారడం, కళ్ల నుంచి నీళ్లు కారడం

ఒకటి రెండుగా కనిపించడం, కంటి చూపు సరిగ్గా లేకపోవడం

తలనొప్పి

వెన్ను, భుజాలు, మెడనొప్పి

వెతురును చూడకపోవడం

చదవడం కష్టం
 

eye health

అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం.. పొడి కళ్ళు, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి కంటి ఒత్తిడికి అత్యంత సాధారణ సంకేతాలు. కొన్ని కంటి సంరక్షణ చిట్కాలను ఉపయోగించి కంటి సమస్యలను తొలగించుకోవచ్చు.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


20-20-20 నియమాన్ని పాటించడం

కంటి సమస్యలను తగ్గించడానికి చాలా సులభమైన మార్గం ఒకే వస్తువులను ఎక్కువ సేపు చూడకుండా ఉండటం. అంటే 20-20-20 నియమాన్ని పాటించాలి. దీనిలో ప్రతి 20 నిమిషాలకు మీ దృష్టిని మీరు చేసే పని నుంచి కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడటం. అలాగే మీరు ఉదయం నుంచి కంప్యూటర్ లో మధ్యాహ్న భోజన సమయంలో కొద్ది సేపు నడవండి. ఆకుపచ్చని వస్తువులను వీలైతే మొక్కలను చూడండి. ఇవి మీ కంటి ఒత్తిడిని తగ్గిస్తాయి. 
 

World Eye Sight Day- Excessive use of electronic devices is a cause of vision problems

సరైన దూరం పాటించండి

డిజిటల్ పరికరాలపై పనిచేసేటప్పుడు వాటికి సరైన దూరం, సరైన స్థానాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. స్క్రీన్ ను మీ కళ్ళకు దగ్గరగా ఉంచకూడదు. స్క్రీన్ ను కొన్ని అడుగుల దూరంలో ఉంచాలి. ఈ స్క్రీన్ మీ కంటికి సూటిగా లేదా కొంచెం కిందిగా ఉండేలా చూసుకోండి. ఫోన్, ట్యాబ్లెట్ కు కూడా ఈ పద్దతినే ఫాలో అవ్వాలి. 
 

కంటి యోగా 

కంటి యోగా చేయడం వల్ల మీ కంటిచూపు, కళ్ళకు మద్దతునిచ్చే కండరాలను టోన్ చేయొచ్చు. ఇది మీ ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. సాధారణ కంటి యోగా వ్యాయామాలలో రెప్పలు కొట్టడం, అరచేతులు, మీ కళ్ళను సాగదీయడం ఉన్నాయి. ఇవి కేవలం విశ్రాంతిని మాత్రమే ఇస్తాయి. అలాగే మీ కళ్ళను బలోపేతం చేస్తాయి.

సరైన కాంతి ఉండేలా చూసుకోవాలి

మసకగా లేదా చాలా ప్రకాశవంతంగా ఉంటే లైట్లను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి కంటి ఒత్తిడికి కారణమవుతాయి. ఇక మీరు చదివేటప్పుడు మీ వెనుక నుంచి కాంతి రావాలి. ఫోన్లు, ట్యాబ్లెట్లలో సినిమాలు చూస్తున్నట్టైతే వెలుతురు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. 
 

కంటి చుక్కలను ఉపయోగించండి

స్క్రీన్ ను ఎక్కువసేపు చూడటం వల్ల కంటిరెప్పలను కొట్టడం మర్చిపోతుంది. తక్కువ సార్లు రెప్పలు కొడితే మీ కళ్ళు పొడిగా మారతాయి. ఇది కంటి చికాకును కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో కంటి చుక్కలను ఉపయోగించండి.  ఇది కళ్లను రిలాక్స్ చేస్తుంది. తిరిగి కళ్లను తేమగా మార్చుతుంది. అందుకే  స్క్రీన్ ను ఎక్కువగా చూడాల్సి వచ్చినప్పుడు తరచుగా కనురెప్పలను కొడుతూ ఉండండి. 
 

కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి

మీరు మీ కళ్లను తెరవడానికి ఇబ్బంది పడితే వాటికి విశ్రాంతి కావాలని అర్థం. అందుకే ఇలాంటి సమయంలో కళ్లను మూసుకుని కూర్చోండి లేదా పడుకోండి. దీనివల్ల మీ ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. 
 

click me!