2023 లో మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

First Published Jan 3, 2023, 11:59 AM IST

కొన్ని రకాల ఆహారాలు గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

ప్రస్తుతం చాలా మంది వేయించిన ఆహారాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను, స్నాక్స్ నే ఎక్కువగా తింటున్నారు. వేయించిన ఆహారాలను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల గుండెకు సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. కొన్ని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. లేదా వాటిని మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఉప్పు

ఉప్పు అధిక హైగ్రోస్కోపిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. నీటి పరిమాణం పెరుగుతుంది. అంతేకాదు రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక రక్తపోటుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు, చక్కెర ఉన్న ఆహారాలు మీ గుండెకు అస్సలు మంచివి కావు.
 

వేయించిన ఆహారాలు

సంతృప్త కొవ్వులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఫాస్ట్ ఫుడ్,  ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు, సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి చెడ్డవి. 

పరిమితికి మించిన సంతృప్త కొవ్వులు మన  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో మీరు బరువు విపరీతంగా పెరుగుతారు.అంతేకాదు ఇన్సులిన్ నిరోధకత ప్రమాదం ఉంటుంది. ఇది చివరికి మీరు  డయాబెటీస్ బారిన పడేలా చేస్తుంది. ఈ ఆహారాలు మీ గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. 

ఎర్ర మాంసం, బర్గర్లు, శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా బంగాళాదుంప ఫ్రైస్ కలిగిన డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ గుండెలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఎందుకంటే వీటిని హైడ్రోజనేటెడ్ నూనెలలో వేయించుతారు. 
 

Soda

చక్కెర సోడాలు, క్యాండీలు

చక్కెరను "తీపి విషం" అని కూడా అంటారు. కేకులు, మఫిన్లు, కుకీలు, తీపి సోడాలు వంటి ఆహారాల్లో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆవి శరీరంలో మంటను కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన చక్కెరతో తయారైన ఆహారాలు బెల్లీ ఫ్యాట్ ను పెంచుతాయి. అలాగే గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. 

చాలా రకాల కేకులు, మఫిన్లు, కుకీలను శుద్ధి చేసిన పిండి లేదా మైదా పిండితోనే తయారుచేస్తారు. ఈ పిండిలో పోషకాలు మొత్తమే ఉండవు. ఇది రక్తపోటును బాగా పెంచుతుంది. మన శరీరాన్ని ఆహారాన్ని శక్తికి ఇంధనంగా సాధారణ చక్కెరలుగా మార్చినప్పటికీ.. వీటిని ఎక్కువ కలిగి ఉండటం మాత్రం హానికరం.

నిజానికి మనకు అదనపు చక్కెర అవసరం లేదు. ఖచ్చితంగా కొంత చక్కెరనుు తీసుకోవాల్సి వస్తే.. ఆరోగ్యకరమైన వయోజనులు  రోజుకు 7 క్యూబ్స్ కంటే ఎక్కువ చక్కెరను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, 250 మి.లీ క్యాన్ సోడాలో సుమారుగా 9 క్యూబ్స్ చక్కెర ఉంటుంది. అంటే మీ రోజువారీ అవసరం కంటే ఇది ఎక్కువ. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. తాజా పరిశోధనల ప్రకారం.. డైట్ సోడాలు ఊబకాయంతో ముడిపడి ఉన్నాయని వెల్లడించాయి. 

ఎర్ర మాంసం

రెడ్ మీట్ ను మాంసాహారుల్లో కొంతమంది బాగా ఇష్టపడతాయి. వీటిలో సంతృప్త కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ధమనులలో ఫలకం ఏర్పడటానికి దారితీసే ఎల్-కార్నిటైన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అందుకే రెడ్ మీట్ కు బదులుగా చేపలను తినండి. వీటిలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు రెడ్ మీట్ ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మితంగా తీసుకోవాలని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

వైట్ పాస్తా/రైస్/వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన పిండి, చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలతో తయారవుతుంది. తెల్ల పాస్తాలు కూడా అంతే. ఇవి మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను కలిగించవు. అలాగే బియ్యంలో  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు. ఇవి మొత్తంగా మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది. 

కూరగాయలు,  పప్పు లేదా కాయధాన్యాలతో వండిన అన్నంలో మంచి పోషక విలువలు ఉంటాయి. అయినా వీటి వినియోగం కూడా పరిమితంగానే ఉండాలి. అన్నం ఎక్కువగా తినేవారు, వ్యాయామం చేయనివారు బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడే ప్రమాదం ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అలాగే మన శరీరంలో కేలరీల పెరుగుదలకు కూడా దారితీస్తుంది. మీరు బరువు పెరిగినప్పుడల్లా మీ గుండె మరింత కష్టపడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!