వరుణ్ సందేశ్ భార్యగా...బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా ఈమె బాగా పాపులర్. అంతకు ముందు ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ప్రేమించే రోజుల్లో అనే సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వితిక వరుసగా ఝుమ్మంది నాదం , భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండీ ప్రేమలో లాంటి సినిమాల్లో నటించచింది.
మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?
అయితే 2015 లో వచ్చిన పడ్డానండీ ప్రేమలో మరి సినిమా టైమ్ లో నిజంగానే వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది వితిక. ఇక ఆతరువాత వీరు వారి పెద్దలను ఒప్పించి 2016 లో పెళ్ళిపీటలెక్కారు. కాగా వితిక షేరు చేసింది తక్కువ సినిమాలే కాని.. హీరోయిన్ గా మంచి లైఫ్ ను చూడాలని ఆమె ఇండస్ట్రీకి వచ్చింది. కాని అడుగడుగున ఆమెకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు వితిక.
2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?
రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వితిక గతంలో తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ఆమె మాట్టాడుతూ.. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు సినిమాప్రయత్నాలు స్టార్ట్ చేశాము. అప్పుడు ఆడిషన్స్ కు నాతో పాటు తోడుగా అమ్మ కూడా వచ్చేది. అలా ఓసారి ఆడిషన్స్ కి వెళ్లాను. అప్పుడు ఓ సినిమా కోసం నన్నుసెలక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది.
8 దేశాల్లో షూటింగ్, 40 భాషల్లో రిలీజ్.. RRR కంటే పెద్ద సినిమా.. హీరో ఎవరో తెలుసా..?
Vithika Sheru
కాని అదే టైంలో మా అమ్మతో మాట్లాడాలి అని చెప్పి నన్ను బయటకు పంపించేశారు. అప్పుడు అమ్మతో వాళ్ళు మీ అమ్మాయి ఈసినిమాలో నటించాలి అంటే.. నిర్మాతలతో కమిట్ అవ్వాల్సి ఉంటుంది అని అన్నారట. దాంతో అసలు ఏంటీ కమిట్మెంట్ అని అమ్మకు అర్ధం అవ్వక.. నన్ను లోపలికి పిలిచింది.
లోపలికి వెళ్ళాక.. కమిట్మెంట్ ఇవ్వాలంటున్నారు చూడు.. అసలేంటో కనుక్కో.. అంటూ.. వాళ్ళ ముందు అమ్మ నాతో అంది. నాకు విషయం అర్థమైంది. వెంటనే నో చెప్పాను. ఎందుకు నో చెప్పాను అనేది మా అమ్మకి వివరించడానికి చాలా కష్టంగా అనిపించింది” అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది వితిక. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.